బయటకు రావద్దు..! రాగల 24 గంటల్లో ఏపీలో భారీ వర్షాలు..!

అమరావతిలో అత్యధికంగా 26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోనూ 26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గుంటూరులో 23 సెంటీమీటర్లు, పల్నాడు జిల్లా అచ్చంపేటలో 19 సెంటీమీటర్లు, గుంటూరు జిల్లాలోని తెనాలిలో 18 సెంటీమీటర్లు

బయటకు రావద్దు..! రాగల 24 గంటల్లో ఏపీలో భారీ వర్షాలు..!

AP Rains : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తోంది. రాగల 24 గంటల్లో మరింత బలహీనపడి ఛత్తీస్ గఢ్-తెలంగాణ వైపు పయనిస్తుంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసరమైతేనే బయటకు రావాలన్నారు. మరోవైపు చేపల వేటకు వెళ్లరాదని మత్స్యకారులను హెచ్చరించారు.

విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం డ్యూటీ ఆఫీసర్ శ్రీనివాస్..
వాయుగుండం.. విశాఖపట్నానికి వాయువ్యంగా 150 కిలోమీటర్ల దూరంలో, కళింగపట్నంకి పశ్చిమ వాయువ్యంగా 190 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. రానున్న 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. కోస్తా జిల్లాల్లో అన్ని చోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తాయి. కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ కంటిన్యూ చేస్తున్నాం. పల్నాడు, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు రెడ్ అలర్ట్ కంటిన్యూ చేస్తున్నాం. ఏలూరు, కృష్ణా, బాపట్ల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కంటిన్యూ చేస్తున్నాం.

Also Read : నీట మునిగిన కాలనీలు, స్తంభించిన జనజీవనం.. విజయవాడలో వరద బీభత్సం

ఏపీపై మరో 24 గంటల పాటు ప్రభావం ఉంటుంది. అమరావతిలో అత్యధికంగా 26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోనూ 26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గుంటూరులో 23 సెంటీమీటర్లు, పల్నాడు జిల్లా అచ్చంపేటలో 19 సెంటీమీటర్లు, గుంటూరు జిల్లాలోని తెనాలిలో 18 సెంటీమీటర్లు, మంగళగిరిలో 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాగల 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గత మూడు రోజుల నుంచి కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు రావడం వల్ల ఈరోజు కూడా ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ కంటిన్యూ అవుతుంది.