Hyderabad Rains: 3 గంటలు నాన్ స్టాప్.. హైదరాబాద్ లో కుమ్మేసిన వర్షం.. ఎటుచూసినా నీళ్లే..

దారి కనిపించలేనంతగా కురిసిన వానతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.

Hyderabad Rains: 3 గంటలు నాన్ స్టాప్.. హైదరాబాద్ లో కుమ్మేసిన వర్షం.. ఎటుచూసినా నీళ్లే..

Updated On : August 8, 2025 / 4:11 PM IST

Hyderabad Rains: హైదరాబాద్ లో వర్షం కుమ్మేసింది. 3 గంటలుగా నాన్ స్టాప్ గా కురిసిన వర్షానికి నగరం నరకంలా మారింది. నగరంలో ఎటు చూసినా నీళ్లే. కుండపోత వానతో నగరంతా నీటిమయమైంది. దారి కనిపించలేనంతగా కురిసిన వానతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యింది.

జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట్, ఎస్ఆర్ నగర్, షేక్ పేట్, మణికొండ ఇలా అన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షం పడింది. పలు ప్రాంతాల్లో గాలి దుమారం బీభత్సం సృష్టించింది. ప్రధాన రహదారులపై వర్షపు నీరు నిలవడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

భారీ వర్షాల నేపథ్యంలో మాన్ సూన్ ఎమర్జెన్సీ బృందాలు రంగంలోకి దిగాయి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు. అప్రమత్తంగా ఉండాలని అన్ని శాఖలకు సీఎం రేవంత్ ఆదేశించారు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని పబ్లిక్ కు సూచించారు. గచ్చిబౌలిలో అత్యధికంగా 12.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. శేరిలింగంప పల్లి కాజాగూడ ప్రాంతంలో 12 సెంటీమీటర్లు, శ్రీనగర్ కాలనీ, అమీర్ పేట్ ప్రాంతాల్లో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.