మరో అల్పపీడనం..! ఏపీ, తెలంగాణకు మరోసారి భారీ నుంచి అతి భారీ వర్ష సూచన..!

సెప్టెంబర్ 10వ తేదీ వరకు వర్షాల ప్రభావం ఉంటుందన్నారు. 5 రోజుల వరకు కుండపోత వానలు పడొచ్చన్నారు.

మరో అల్పపీడనం..! ఏపీ, తెలంగాణకు మరోసారి భారీ నుంచి అతి భారీ వర్ష సూచన..!

Ap Telangana Rain Alert (Photo Credit : Google)

Ap Telangana Rain Alert : తెలుగు రాష్ట్రాలను వరుణుడు వెంటాడుతున్నాడు. ఇప్పటికే భారీ వర్షాలు, వరదలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అతలాకుతలం అయ్యాయి. జన జీవనం స్తంభించింది. ఇది చాలదన్నట్లు మరోమారు తెలుగు రాష్ట్రాలకు వాన గండం పొంచి ఉంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మరోసారి వర్షం బీభత్సం సృష్టించనుందని వాతావరణ కేంద్రం తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంది.

అల్పపీడనం, మాన్సూన్ ట్రఫ్ కారణంగా తెలంగాణ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి తెలిపారు. సెప్టెంబర్ 4, 5 తేదీల్లో రెండు రోజుల పాటు హెవీ, వెరీ హెవీ రెయిన్స్ కురుస్తాయని హెచ్చరికలు జారీ చేశారు. 6,7,8 తేదీల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. సెప్టెంబర్ 10వ తేదీ వరకు వర్షాల ప్రభావం ఉంటుందన్నారు. 5 రోజుల వరకు తెలంగాణ వ్యాప్తంగా కుండపోత వానలు పడొచ్చన్నారు. ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో కుండపోత వానలు కురుస్తాయన్నారు.

”నిన్న రాత్రి రెండు జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. సిద్ధిపేట జిల్లాలో అత్యధికంగా 17 సెంటీమీటర్లు, నిజామాబాద్ జిల్లాలో 13 సెంటీమీటర్లు, ఆసిఫాబాద్, మంచిర్యాల, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో 7 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. రేపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. ప్రస్తుతం తెలంగాణలోని రామగుండం నుండి కళింగపట్నం వరకు మాన్ సూన్ ట్రఫ్ కొనసాగుతోంది. కోస్తాంధ్ర తీరంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం.. రేపటికల్లా అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీని కారణంగా రాష్ట్రంలో భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది” అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి తెలిపారు.

ఎల్లో అలర్ట్…
డే-1 : భారీ, అతి భారీ వర్షాల అలర్ట్ – కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం.
హైదరాబాద్ లో తేలికపాటి నుంచి మోస్తరు వర్ష సూచన.
మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట, భద్రాచలం జిల్లాలకు భారీ వర్ష సూచన. మిగతా చోట్ల మోస్తరు, కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం.
Day 2-భారీ, అతి భారీ వర్షాల అలర్ట్. ఉత్తర ఈశాన్య జిల్లాలో భారీ వానలు కురిసే అవకాశం.
5 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా కురవనున్న వర్షాలు.

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది. రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఆశకాశం ఉందంది. రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే చాన్స్ ఉందంది. అల్పపీడనం ప్రభావంతో నేటి నుంచి ఉత్తరాంధ్రలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయంది. పల్నాడు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయంది.

Also Read : ఏరుకన్నా తక్కువైన బుడమేరు ఉప్పెనలా విజయవాడపై విరుచుకుపడటానికి కారణం వారేనా? చంద్రబాబు అంత సాహసం చేస్తారా?

ఈ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్..
కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు.
అల్లూరి, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు ఎల్లో అలెర్ట్.
సముద్రం అలజడిగా ఉంది. మత్స్యకారులు మూడు రోజులు వేటకు వెళ్ళరాదు” అని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది.