Weather Updates: మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు..!
ఈ విధ్వంసం నుంచి తేరుకోకముందే తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరో షాక్ తగిలింది.
Weather Updates: మొంథా తుపాను విధ్వంసం సృష్టించింది. తుపాను కారణంగా తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో జనజీవనం స్థంభించిపోయింది. పంటలకు అపారమైన నష్టం వాటిల్లింది. మొంథా తుపాన్ వాయుగుండంగా బలహీనపడింది.
ఈ విధ్వంసం నుంచి తేరుకోకముందే తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరో షాక్ తగిలింది. అరేబియా సముద్రంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఆంధప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంది. కోస్తాంధ్ర, రాయలసీమ, విదర్భకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ.
మొంథా తుపాను ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నాన్ స్టాప్ గా కురుస్తున్న వానలతో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి రాకపోకలు నిలిచిపోయాయి. విస్తారంగా కురుస్తున్న వానలతో పంట పొలాలు నీటమునిగాయి. రైతన్నకు అపార నష్టం కలిగింది. తమ కష్టమంతా నీటిపాలైందంటూ అన్నదాతలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
అల్లూరి జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో పాడేరు ఏజెన్సీలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మచ్చగడ్డ ఉధృతంగా ప్రవహించడంతో నాలుగు పంచాయతీలకు రాకపోకలు నిలిచిపోయాయి. మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు వంతెన పై నుంచి వరద నీరు భారీగా ప్రవహిస్తోంది. కోడపల్లి, కిముడుపల్లి, కుంతర్ల, కించురు పంచాయతీలకు చెందిన సుమారు 56 గ్రామాల ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి.
ఖమ్మం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. విశాఖ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న వందే భారత్ రైలను ఖమ్మం రైల్వే స్టేషన్ లో గంట సేపు నిలిపేశారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
Also Read: రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. 55 రైళ్లు రద్దు.. 27 దారి మళ్లింపు..
