Turkey Earthquake: భూకంపం నుంచి బయటపడ్డ ఈ చిన్నారి ఆనందం చూడండి.. వైరల్ అవుతున్న వీడియో

శిథిలాల కిందే చిక్కుకుని నీళ్లు, ఆహారం లేక సాయం కోసం ఎదురు చూస్తున్న వారిని సహాయక బృందాలు రక్షిస్తున్నాయి. బాధితులంతా ప్రాణాలు బిగబట్టుకుని, ఎవరో ఒకరు తమను రక్షించకపోతారా అని ఎదురు చూస్తున్నారు. అలాంటి వాళ్లలో అప్పుడే పుట్టిన, నెలల వయసున్న చిన్నారులు, గర్భిణులు, వృద్ధులు.. ఇలా అన్ని వయసుల వాళ్లు ప్రాణాలతో బయటపడుతున్నారు.

Turkey Earthquake: భూకంపం నుంచి బయటపడ్డ ఈ చిన్నారి ఆనందం చూడండి.. వైరల్ అవుతున్న వీడియో

Turkey Earthquake: టర్కీ, సిరియాల్లో భూకంపం సంభవించి వారం రోజులైనప్పటికీ కొందరు ప్రాణాలతో బయటపడుతున్నారు. శిథిలాల కిందే చిక్కుకుని నీళ్లు, ఆహారం లేక సాయం కోసం ఎదురు చూస్తున్న వారిని సహాయక బృందాలు రక్షిస్తున్నాయి.

Delhi: తల్లితోపాటు ఫ్యాక్టరీకి వెళ్లిన బాలుడు.. ఎలివేటర్ షాఫ్ట్‌లో చిక్కుకుని మృతి

బాధితులంతా ప్రాణాలు బిగబట్టుకుని, ఎవరో ఒకరు తమను రక్షించకపోతారా అని ఎదురు చూస్తున్నారు. అలాంటి వాళ్లలో అప్పుడే పుట్టిన, నెలల వయసున్న చిన్నారులు, గర్భిణులు, వృద్ధులు.. ఇలా అన్ని వయసుల వాళ్లు ప్రాణాలతో బయటపడుతున్నారు. వీరిలో రెండు నెలల వయసున్న ఒక చిన్నారి బాబు ఆదివారం బయటపడ్డాడు. దాదాపు ఐదు రోజులపాటు ఆ చిన్నారి పాలు లేకుండా జీవించి ఉండటం విశేషం. ఆ చిన్నారిని బయటకు తీసినప్పుడు ఒళ్లంతా ధూళి, దుమ్ము పట్టి, చిన్న గాయాలతో ఉన్నాడు. సరిగ్గా ఆహారం లేకపోవడం వల్ల నీరసించి కనిపించాడు.

Aero India 2023: ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్ షో.. సోమవారం బెంగళూరులో ప్రారంభించనున్న మోదీ

సహాయక బృందాలు ఆ చిన్నారిని వెలికి తీసి, రక్షణ కేంద్రానికి తరలించాయి. అక్కడ బాలుడికి వైద్య, సహాయ సిబ్బంది తగిన సపర్యలు చేశారు. బాలుడికి స్నానం చేయించి, శుభ్రం చేసి, పాలు పట్టారు. చాలా రోజుల తర్వాత కడుపు నిండా పాలు తాగడంతో చిన్నారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అతడి ముఖంలో సంతోషం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఆదివారం ఆ చిన్నారి దుమ్ము, ధూళితో ఉన్న వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. ఇప్పుడు సంతోషంతో, ఆరోగ్యంగా ఉన్న అదే చిన్నారి వీడియో కూడా వైరల్ అవుతోంది.

భూకంపం నుంచి సురక్షితంగా బయటపడ్డ ఆ చిన్నారి నవ్వుతూ ఉన్న వీడియో ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆ చిన్నారి సంతోషాన్ని చూసి, నెటిజన్లు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.