Vande Bharat Express : ఎరక్కపోయి ఇరుక్కుపోయాడు.. సెల్ఫీ కోసం వందే భారత్ ట్రైన్‎ ఎక్కి అడ్డంగా బుక్కయ్యాడు

సెల్ఫీ తీసుకునేందుకు వందే భారత్ ఎక్కి అడ్డంగా బుక్కయ్యాడు ఓ వ్యక్తి. రాజమండ్రిలో ఓ వ్యక్తి వందే భారత్ ఎక్స్ ప్రెస్ ఎక్కాడు. ఎంచక్కా సెల్ఫీలు దిగి వాటిని చూసుకుని మురిసిపోవాలని కలలు కన్నాడు. అయితే, ఆ వ్యక్తి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలోనే రైలు డోర్లు ఆటోమేటిక్ గా లాక్ అయ్యాయి.

Vande Bharat Express : ఎరక్కపోయి ఇరుక్కుపోయాడు.. సెల్ఫీ కోసం వందే భారత్ ట్రైన్‎ ఎక్కి అడ్డంగా బుక్కయ్యాడు

Vande Bharat Express : సెల్ఫీ తీసుకునేందుకు వందే భారత్ ఎక్కి అడ్డంగా బుక్కయ్యాడు ఓ వ్యక్తి. రాజమండ్రిలో ఓ వ్యక్తి వందే భారత్ ఎక్స్ ప్రెస్ ఎక్కాడు. ఎంచక్కా సెల్ఫీలు దిగి వాటిని చూసుకుని మురిసిపోవాలని కలలు కన్నాడు. అయితే, ఆ వ్యక్తి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలోనే రైలు డోర్లు ఆటోమేటిక్ గా లాక్ అయ్యాయి. అంతే, ఆ వ్యక్తి బిత్తరపోయాడు. హడావుడిగా రైలు దిగాలని ప్రయత్నించాడు. కానీ, అప్పటికే ట్రైన్ కదిలింది.

రైలుని ఆపాలని, డోర్లు ఓపెన్ చేయాలని ఆ వ్యక్తి సిబ్బందిని వేడుకున్నాడు. అయితే, ఆ డోర్లు ఓపెన్ కావని, ఆ రైలు కూడా విజయవాడలోనే ఆగుతుందని సిబ్బంది అతడికి తేల్చి చెప్పారు. దాంతో ఆ వ్యక్తి కంగుతిన్నాడు. ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయానని తెగ ఫీల్ అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

Also Read..Vande Bharat Express : వారెవ్వా వందే భారత్.. అదిరిపోయే ఫీచర్లు, రైలులో విమాన ప్రయాణం అనుభూతి

ఇటీవలే తెలుగు రాష్ట్రాల మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు సేవలు ప్రారంభం అయ్యాయి. సికింద్రాబాద్-విశాఖ మధ్య వందే భారత్ పరుగులు పెడుతోంది. కాగా, వందే భారత్ గురించి బాగా క్రేజ్ నెలకొంది. ఈ రైలుతో ఫోటోలు, సెల్ఫీలు దిగేందుకు అంతా ఆసక్తి చూపుతున్నారు. వందే భారత్ తో ఫోటోలు దిగి వాటిని చూసుకుని మురిసిపోతున్నారు. అయితే, ఈ సెల్ఫీల మోజు ఒక్కోసారి సమస్యల్లోకి నెట్టేస్తోంది. ఊహించని ప్రమాదాల్లో పడిపోతున్నారు.

Also Read..Vande Bharat Express : జస్ట్ 8.40 గంటలే.. 3రోజుల్లో సికింద్రాబాద్-వైజాగ్ మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పరుగులు

తాజాగా రాజమండ్రి వ్యక్తి విషయంలో అదే జరిగింది. వందే భారత్ లో సెల్ఫీ దిగాలని సరదా పడ్డాడు. అయితే, అక్కడి పరిస్థితులను అతడు అంచనా వేయలేదు. గుడ్డిగా ముందుకు కదిలాడు. ఎంచక్కా ట్రైన్ ఎక్కి సెల్ఫీ దిగేందుకు ఫోజులు ఇచ్చాడు. ఇంతలో ఊహించని ఘటన జరిగింది. డోర్లు ఆటోమేటిక్ గా లాక్ అయిపోయాయి. అంతేకాదు ట్రైన్ కూడా కదిలింది. దీంతో ఆ వ్యక్తి బిత్తరపోయాడు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

నేను దిగిపోవాలి, ట్రైన్ ఆపండి, డోర్లు ఓపెన్ చేయండి అని సిబ్బందితో గగ్గోలు పెట్టాడు. కానీ, ప్రయోజనం లేకుండా పోయింది. అవి అటోమేటిక్ డోర్లు అని, ఆ ట్రైన్ విజయవాడలోనే ఆగుతుందని చెప్పడంతో పాపం అతడి పరిస్థితి అయోమయంగా మారింది. సిబ్బంది చేతులు ఎత్తేయడంతో దిక్కులు చూశాడు. ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయానే అని తెగ ఫీలైపోయాడు.