Viral Video: కాయిన్స్ ఎగరేయడం నేర్చుకుంటున్న పిల్లి.. ఆకట్టుకుంటున్న వీడియో
కాయిన్ ఫ్లిప్పింగ్ గురించి మనందరికీ తెలిసిందే. చేతిలో ఉన్న కాయిన్ ఎగరేసి, అది కిందపడగానే దాన్ని చేతితో మూసేస్తాం. సాధారణంగా ఇది మనుషులే చేయగలరు. జంతువులు చేయడం చాలా అరుదు. కానీ, ఒక పిల్లి మాత్రం ఈ కాయిన్ ఫ్లిప్పింగ్ నేర్చుకుంది.

Viral Video: సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు ట్రెండ్ అవుతుంటాయి. తాజాగా ఒక క్యూట్ వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది. కాయిన్ ఫ్లిప్పింగ్ గురించి మనందరికీ తెలిసిందే. చేతిలో ఉన్న కాయిన్ ఎగరేసి, అది కిందపడగానే దాన్ని చేతితో మూసేస్తాం. సాధారణంగా ఇది మనుషులే చేయగలరు.
జంతువులు చేయడం చాలా అరుదు. కానీ, ఒక పిల్లి మాత్రం ఈ కాయిన్ ఫ్లిప్పింగ్ నేర్చుకుంది. తన యజమాని దగ్గరి నుంచి ఈ టెక్నిక్ నేర్చుకుంది. రోజూ అతడు కాయిన్ ఎగరేస్తూ కాయిన్ ఫ్లిప్పింగ్ చేస్తూ ఉంటే, అది చూసి ఆ పిల్లి కూడా నేర్చుకుంది. ఇప్పుడా పిల్లి కూడా కాయిన్ ఫ్లిప్పింగ్ చేసేస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను ఆ పిల్లి యజమాని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో నెటిజన్లు ఆకర్షిస్తోంది. కావాలంటూ ఈ వీడియో మీరూ చూడండి.
Well done kitty.. ? pic.twitter.com/3yoQg3kDHO
— Buitengebieden (@buitengebieden) January 28, 2023