Strawberry Moon 2021: ఆకాశంలో అద్భుతం.. నేడే స్ట్రాబెర్రీ మూన్ కనువిందు

ప్రతీరోజూలాగే సూర్యుడు అస్తమించిన వెంటనే ఈరోజు కూడా చంద్రుడు ఉద్భవిస్తాడు. కానీ, చంద్రుడు చూడడానికి ఈరోజు(24 జూన్ 2021) వేరే విధంగా కనిపిస్తాడు. ఈ దృశ్యాన్ని స్ట్రాబెర్రీ మూన్ అంటారు. ఈ రోజు పౌర్ణమి కాగా.. స్ట్రాబెర్రీ మూన్ కనిపిస్తుంది అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ రోజు కనిపించే చంద్రుడి రంగు స్ట్రాబెర్రీ మాదిరిగానే ఉంటుంది.

Strawberry Moon 2021: ఆకాశంలో అద్భుతం.. నేడే స్ట్రాబెర్రీ మూన్ కనువిందు

Strawberry Moon 2021 (1)

Amazing view of Moon: ప్రతీరోజూలాగే సూర్యుడు అస్తమించిన వెంటనే ఈరోజు కూడా చంద్రుడు ఉద్భవిస్తాడు. కానీ, చంద్రుడు చూడడానికి ఈరోజు(24 జూన్ 2021) వేరే విధంగా కనిపిస్తాడు. ఈ దృశ్యాన్ని స్ట్రాబెర్రీ మూన్ అంటారు. ఈ రోజు పౌర్ణమి కాగా.. స్ట్రాబెర్రీ మూన్ కనిపిస్తుంది అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఈ రోజు కనిపించే చంద్రుడి రంగు స్ట్రాబెర్రీ మాదిరిగానే ఉంటుంది. దీనిని స్ట్రాబెర్రీ మూన్ అని పిలుస్తారు. ఈ రోజున చంద్రుడు దాని కక్ష్యలో భూమికి సామీప్యత కారణంగా దాని సాధారణ పరిమాణం కంటే పెద్దదిగా కనిపిస్తుంది. స్ట్రాబెర్రీ మూన్‌ను హనీ మూన్ అని కూడా అంటారు.

మనమందరం ఇప్పటికే, బ్లడ్ మూన్స్, సూపర్ మూన్ ఇలా చాలా చూశాము. పౌర్ణమిరోజు కనిపించే చంద్రుడిని పౌర్ణమి చంద్రుడు అని పిలుస్తాము.. అప్పుడప్పుడూ సూపర్ మూన్ కనిపిస్తాడు. ఈ నెలలో స్ట్రాబెర్రీ మూన్‌గా చంద్రుడు కనిపిస్తాడు.

అమెరికాలో స్ట్రాబెర్రీల పంట కాలం ప్రారంభంలో వచ్చే పౌర్ణమి కావడంతో ఈ పౌర్ణమిలో కనిపించే చంద్రుడికి స్ట్రాబెర్రీ మూన్ అని పేరు పెట్టుకున్నారు. ఉత్తర అమెరికాలోని అల్గోన్‌క్విన్ తెగలు దీనికి స్ట్రాబెర్రీ మూన్ అని పేరు పెట్టారు.

ఈ పౌర్ణమికి ప్రపంచంలో వేర్వేరు పేర్లున్నాయి. ఐరోపాలో దీనిని రోజ్ మూన్ అంటారు. స్ట్రాబెర్రీ మూన్‌ను హాట్ మూన్, హనీమూన్ మరియు రోజ్ మూన్ అని కూడా పిలుస్తారు. ఉత్తర అర్ధగోళంలో, భూమధ్యరేఖకు ఉత్తరాన వేసవి కాలం ప్రారంభంతో సమానంగా దీనిని హాట్ మూన్ అని కూడా పిలుస్తారు.

భూమి చుట్టూ ఒక పరిభ్రమణం పూర్తి చేయడానికి చంద్రుడు దాదాపు 29.5 రోజులు పడుతుంది, ఈ సమయంలో అది పూర్తి దశకు చేరుకుంటుంది. స్ట్రాబెర్రీ మూన్‌తో వేసవి కాలం కలవడం అనేది 20 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది.

అయితే, భారతదేశంలో ఈ స్ట్రాబెర్రీ మూన్ కనిపించకపోవచ్చునని నిపుణులు చెబుతున్నారు. భారతీయులు స్ట్రాబెర్రీ మూన్‌ను ఆన్‌లైన్‌లోనే చూసే అవకాశం ఉంది.