Telangana : తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు

కేరళను తాకిన నైరుతి రుతు పవనాలు మూడు నాలుగు రోజుల్లో కేరళతో పాటు తమిళనాడు, కర్ణాటకలోని మరి కొన్ని ప్రాంతాలకు విస్తరిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

Telangana : తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు

Telangana Rains

Telangana :  కేరళను తాకిన నైరుతి రుతు పవనాలు మూడు నాలుగు రోజుల్లో కేరళతో పాటు తమిళనాడు, కర్ణాటకలోని మరి కొన్ని ప్రాంతాలకు విస్తరిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అలాగే ఈశాన్య రాష్ట్రాలలోనూ రుతుపవనాలుముందుకు సాగుతాయని వివరించారు. వాతావరణంలో వస్తున్న మార్పులతో జూన్‌ 3వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.

అలాగే పలు జిల్లాల్లో మంగళవారం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం వచ్చే అవకాశం ఉందని వారు వివరించారు. సోమవారం 14 జిల్లాల్లో పలు చోట్ల ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో  కూడిన వర్షం కురిసిందని, అత్యధికంగా ఖమ్మం జిల్లా కొణిజర్ల 3.20, గుబ్బగుర్తి 2.63 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది.

ఉపరితల ద్రోణి ఆగ్నేయ అరేబియా తీరంలోని ఉత్తర కేరళ, కర్ణాటకల నుంచి తమిళనాడు, కేరళ, మీదుగా నైరుతి బంగాళాఖాతం వరకు సముద్ర మట్టానికి 3.1 కిలో మీటర్ల ఎత్తున ఏర్పడిందని ….. రాష్ట్రంలో పశ్చిమ దిశ నుంచి బలమైన గాలులు వీస్తున్నాయని తెలిపారు.