బీజేపీ రోడ్ షోలో సాప్నా చౌదరి

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఢిల్లీలో సోమవారం(ఏప్రిల్-22,2019) నార్త్ ఈస్ట్ ఢిల్లీ బీజేపీ అభ్యర్థి మనోజ్ తివారీ రోడ్ షో నిర్వహించారు.ఈ రోడ్ లో కేంద్రమంత్రి విజయ్ గోయల్ తో పాటుగా హర్యానాకు చెందిన పాపులర్ డ్యాన్సర్,యాక్టర్ సాప్నా చూదరి కూడా పాల్గొన్నారు.మనోజ్ తివారీ తనకు మంచి ఫ్రెండ్ అని,ఆయన కోసమే రోడ్ షోలో పాల్గొన్నానని,తాను బీజేపీలో చేరలేదని ఈ సందర్భంగా సాప్నా చౌదరి తెలిపారు.
Also Read : చిచ్చు పెట్టిన కుక్క : మహిళలను చితక్కొట్టిన కాంగ్రెస్ లీడర్
హిందీ రాష్ట్రాల్లో సాప్నా చౌదరికి ఉన్నంత పాపులారిటీ అంతా ఇంతా కాదు.ఆమె డ్యాన్స్ అంటే ఇష్టపడనివారుండరు. హిందీ బెల్ట్ లో సాప్నా ఓ సెన్సేషన్. సాప్నా ఓ కల్చరల్ ఐకాన్. అలాంటి సాప్నా తమ పార్టీలోకి వస్తే తమకు ఇక విజయం ఖాయని పలు పార్టీలు భావిస్తుంటాయి.ఇటీవల సాప్నా కాంగ్రెస్ తో చేరుతున్నట్లు వార్తలు కూడా వచ్చాయి.బీజేపీ కూడా తమ పార్టీలో చేరాలని ఆమెకు ఆహ్వానం పంపింది.అయితే తాను ఏ పార్టీలో చేరనని ఇటీవల ఆమె క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.
Also Read : రోహిత్ తివారీని హత్య చేసింది భార్యే! : పోలీసుల కస్టడీలో అపూర్వ