Ram Asur Movie : మూవీ రివ్యూ

ఈ శుక్రవారం ఓ సరికొత్త కథను టాలీవుడ్ ఆడియన్స్‌కు పరిచయం చేశారు ‘రామ్ అసుర్ (పీనట్ డైమండ్)’ సినిమా టీం..

Ram Asur Movie : మూవీ రివ్యూ

Ram Asura Movie Review

Ram Asur Movie: తెలుగు ప్రేక్షకులు కొత్త కథా కథనాలకు ఎప్పుడూ కూడా పెద్ద పీట వేస్తారు. నటీనటులు కొత్త వారైనా సరే సినిమా బాగుంటే కచ్చితంగా ఆదరిస్తారనే నమ్మకంతో మరో సరికొత్త కథను టాలీవుడ్ ఆడియన్స్‌కు పరిచయం చేశారు ‘రామ్ అసుర్ (పీనట్ డైమండ్)’ సినిమా టీం. ఈ మూవీ స్టోరీ మొత్తం ఓ డైమండ్ చుట్టూ తిరుగుతుంది. దాన్ని ‘పీనట్ డైమండ్’ అని కూడా అంటారు. డైమండ్ చుట్టూ తిరిగే కథకు రెండు జీవితాల్ని ముడిపెట్టడం అనే అంశాలతో ఆసక్తికరంగా తెరకెక్కిన ‘రామ్ అసుర్’ ఈ శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

Pushpa Movie : నన్ను కొట్టేటోడు భూమ్మీద పుట్టలేదంటున్న ‘పుష్ప’ రాజ్..

కథ..

రామ్ (రామ్ కార్తీక్) ఓ ఆర్టిఫిషియల్ వజ్రం తయారు చేయడానికి ట్రై చేస్తుంటాడు. కానీ ఎంత ప్రయత్నించినా సక్సెస్ కాలేడు. అదే టైమ్‌లో గర్ల్‌ఫ్రెండ్ హ్యాండ్ ఇవ్వడంతో బాగా డిస్టర్బ్ అవుతాడు. ఎలాగైనా జీవితంలో కోలుకోవాలనే ఉద్దేశంతో ఫ్రెండ్ సాయంతో పెద్దాయన రామాచారిని కలుస్తాడు. ఆయన సూచన మేరకు సూరి (అభినవ్ సర్దార్) అనే వ్యక్తిని కలవడానికి ప్రయత్నిస్తాడు. ఇంతకీ సూరికి, రామ్‌కు సంబంధం ఏంటి? అస్సలు సంబంధం లేని వీళ్లిద్దరి జీవితాలు ఎలా కలిసాయి? ఫైనల్‌గా రామ్, పీనట్ డైమండ్‌ తయారు చేసాడా లేదా? రామ్ రాకతో సూరి జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? ఈ విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

RRR Movie : ‘నాటు నాటు’ సాంగ్‌కి నడిరోడ్డుపై ఊరమాస్ డ్యాన్స్!

నటీనటులు..
రామ్ కార్తీక్ ఎప్పట్లానే రొమాంటిక్ బాయ్‌గా కనిపించాడు. సూరి పాత్ర పోషించిన అభినవ్ సర్దార్ మాత్రం ది బెస్ట్ ఇచ్చాడు. ఓ షేడ్‌లో లవర్ బోయ్‌గా, మరో షేడ్‌లో ఎగ్రెసివ్ లుక్‌లో సర్దార్ యాక్టింగ్ బాగుంది. షెర్రీ అగర్వాల్ తన గ్లామర్ డోస్‌తో ఆకట్టుకోగా.. చాందిని తమిళరాసన్ తన పెర్ఫార్మెన్స్‌తో ఎట్రాక్ట్ చేసింది. రామాచారిగా శుభలేఖ సుధాకర్, బలరాం రాజుగా సుమన్, శివ పాత్రలో షానీ సాల్మన్ తమ పాత్రల మేరకు చక్కగా నటించారు.

RRR Movie : ‘కొంచెం ఆగండి బ్రో.. మధ్యలో చెప్పు ఊడిపోయింది’..

టెక్నీషియన్స్..
భీమ్స్ అందించిన సంగీతంతో పాటు బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ప్రభాకర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, శంకర్ ఫైట్స్ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచాయి. ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వ విభాగాలన్నింటినీ వెంకటేష్ త్రిపర్ణ హ్యాండిల్ చేసాడు. మొదటి సినిమాకే ఇన్ని బాధ్యతల్ని భుజాన వేసుకున్న ఈ డైరక్టర్.. తనకున్న బడ్జెట్ పరిమితుల్లో ది బెస్ట్ ఔట్ పుట్ ఇచ్చాడు. నిజం చెప్పాలంటే.. ఈ మల్టీస్టారర్ కథకు కాస్త స్టార్ ఎట్రాక్షన్ ఉన్న హీరోలు పడితే, ‘రామ్-అసుర్’ సినిమా నెక్ట్స్ లెవెల్లో ఉండేది.

Akkineni Nagarjuna : కింగ్ వేస్తే ఆమాత్రం కాస్ట్ ఉండాల్లే!

మొత్తమ్మీద దర్శకుడిగా తన పట్టు ఏంటో తొలి సినిమాతోనే చూపించాడు వెంకటేష్. తొలి సినిమాకే కాస్త క్లిష్టంగా, కష్టంగా అనిపించే కథను సెలక్ట్ చేసుకున్న వెంకటేష్.. సెకండాఫ్ నుంచి తన రైటింగ్ పవర్ చూపించాడు. స్క్రీన్ ప్లేలో, ట్విస్టుల్లో చమక్కులు చూపించాడు. సినిమా ఎండింగ్‌లో కూడా డైరెక్టర్స్ కట్ కనిపిస్తుంది.

Vijay Sethupathi : విజయ్ సేతుపతి ఫ్యామిలీని చూశారా..

ఓవరాల్‌గా..
ఓవరాల్ గా రామ్ అసుర్ సినిమా, టాలీవుడ్ ప్రేక్షకులకు ఓ కొత్త కథను పరిచయం చేస్తుంది. ఫస్టాఫ్ కాస్త నెమ్మదిగా సాగినప్పటికీ.. పరిచయమున్న నటీనటులు లేకపోయినప్పటికీ.. సెకండాఫ్ నుంచి ఈ సినిమా ఆడియన్స్‌కు ఫుల్ థ్రిల్ అందిస్తుంది.

Nataraj Master : మళ్లీ తండ్రైన నటరాజ్ మాస్టర్..