Bigg Boss 5 : 50 లక్షలు గెలిస్తే ఏం చేస్తారు? కంటెస్టెంట్స్‌కు బిగ్ బాస్ ప్రశ్న.. ఎవరెవరు ఏం చెప్పారో చూడండి..
కంటెస్టెంట్స్ ని ఈ ప్రైజ్‌మనీ గెలిస్తే ఆ డబ్బుతో ఎవరేం చేస్తారో చెప్పాలని ఆదేశించాడు నాగ్. దీంతో కంటెస్టెంట్స్ అంతా 50 లక్షలు గెలిస్తే ఏం చేస్తారో....
Bigg Boss 5 : గతంలో బిగ్ బాస్ షో విజేతలకు రూ.50 లక్షల ప్రైజ్‌మనీ మాత్రమే ఇచ్చేవారు. ఈ సీజన్లో 50 లక్షలతో పాటు అదనంగా ఇల్లు కట్టుకోవడానికి స్థలం కూడా ఇవ్వబోతున్నారు. ఈ విషయాన్ని నాగార్జున నిన్నటి వీకెండ్ ఎపిసోడ్ లో అధికారికంగా ప్రకటించాడు. బిగ్‌బాస్ విన్నర్ రూ.50 లక్షలతో పాటు, షాద్‌నగర్‌లోని సువర్ణ కుటీర్‌లో రూ.25 లక్షల విలువైన 300 చదరపు గజాల స్థలాన్ని సైతం సొంతం చేసుకోవచ్చు అని తెలిపాడు. అయితే కంటెస్టెంట్స్ ని ఈ ప్రైజ్‌మనీ గెలిస్తే ఆ డబ్బుతో ఎవరేం చేస్తారో చెప్పాలని ఆదేశించాడు నాగ్. దీంతో కంటెస్టెంట్స్ అంతా 50 లక్షలు గెలిస్తే ఏం చేస్తారో చెప్పారు.
Bigg Boss 5 : ప్రైజ్‌మనీ కంటే ఎక్కువే సంపాదించిన రవి.. అందుకే బిగ్ బాస్ నుంచి అవుట్ అయ్యాడా??
మొదట ప్రియాంక మాట్లాడుతూ.. నేను రూ.50 లక్షలు గెలుచుకుంటే నా తల్లిదండ్రుల కోసం ఇల్లు కొనిస్తాను. అలాగే నాకు చిన్నప్పటి నుంచి అమ్మ అని పిలిపించుకోవాలని కోరికగా ఉండేది. కానీ దత్తత తీసుకోవాలంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలన్నారు. కాబట్టి ఈ ప్రైజ్‌మనీ గెలిస్తే ఒక అమ్మాయిని దత్తత తీసుకుంటాను అని తెలిపింది.
శ్రీరామ్ మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకులకు ఇంకా దగ్గరవ్వడానికే ఈ షోకు వచ్చాను. అందుకే ఇక్కడే పెద్ద ఇల్లు కట్టి పేరెంట్స్‌తో కలిసి ఉంటాను అని అన్నాడు.
రవి మాట్లాడుతూ.. కొంత వియా చదువు కోసం పొదుపు చేస్తాను. మరికొంత నిర్మాణసంస్థ నెలకొల్పాన్న నా కోరికను నెరవేర్చుకుంటాను అని చెప్పాడు.
కాజల్.. తనకున్న 30 లక్షల రూపాయల అప్పు తీరుస్తాను, అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టాలనుకుంటున్నానని చెప్పింది.
సన్నీ.. వచ్చిందంతా అమ్మకిచ్చేస్తానని, కొంత డబ్బు మాత్రం తీసుకుని సెలూన్ పెడతానన్నాడు.
మానస్.. తనకు వచ్చిన డబ్బుతో నిర్మాణ సంస్థను నెలకొల్పి కొత్తవాళ్లను ఎంకరేజ్ చేస్తానని చెప్పాడు.
షణ్ముఖ్.. ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని పెంచుతున్న మా అమ్మకు 25 లక్షలు ఇస్తాను. అలాగే నాకెన్నో సార్లు డబ్బు సాయం చేసి ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చిన దీప్తి సునయనకు మిగిలిన 25 లక్షలిస్తానన్నాడు.
సిరి.. శ్రీహాన్ పేరెంట్స్‌కు ఉన్న 10 లక్షల అప్పు తీర్చేసి కొంత అమ్మకిస్తానని, అలాగే అంధులకు సాయం చేస్తానని చెప్పింది.
Shivashankar Master : శివశంకర్ మాస్టర్ గురించి మీకు తెలియని విషయాలు..