Tribal Woman Fight : బిడ్డ కోసం తల్లి సాహసం.. ఒంటి చేత్తో చిరుతపై పోరాటం
ఇంటి బయట ఉన్న బిడ్డను చిరుత లాక్కెళ్ళింది. తన బిడ్డను కాపాడుకునేందుకు తల్లి చిరుతతోనే ఫైట్ చేసింది.
Tribal Woman Fight : బిడ్డకు ఆపద వచ్చిందంటే తల్లి హృదయం తల్లడిల్లుతోంది. తన ప్రాణాలను లెక్కచేయకుండా ఆపదలో ఉన్న బిడ్డలను కాపాడుతుంది. చేతులనే ఆయుధాలుగా చేసుకొని అపర కాళీమాతలుగా ఉగ్రరూపం దాల్చి ఆగంతకులు, దొంగల నుంచి తమ బిడ్డలను కాపాడుకున్న ఘటనలు కోకొల్లలు. అయితే ఓ తల్లి ఇంతకంటే గొప్ప సాహసం చేసింది. ఓ చిరుత తన బిడ్డను ఎత్తుకెళ్ళడంతో ప్రాణాలకు తెగించి తన బిడ్డను రక్షించుకుంది. ఈ ఘటన మధ్యప్రదేశ్లో జరిగింది.
చదవండి : Madhya Pradesh : స్కూల్ బస్సు మిస్.. చెట్టుకు ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య!
వివరాల్లోకి వెళితే.. సిధి జిల్లాలోని సంజయ్ టైగర్ జోన్లోని ఝరియా అనే గ్రామంలో శంకర్ బైగా, కిరణ్ బైగా తమ ముగ్గురు పిల్లలతో కలిసి జీవిస్తున్నారు. ఓ రోజు సాయంత్రం కిరణ్ బైగా తన పిల్లలతో కూర్చొని చలిమంట కాగుతుంది. ఇంతలోనే ఓ చిరుత అక్కడికి వచ్చి తన కుమారుడు రాహుల్ (8)ని నోటకరచి అడవిలోకి లాక్కెళ్ళింది.
చదవండి : Madhyapradesh : రాక్షస తండ్రి, కూతురిపై హత్యాచారం
ఈ హఠాత్ పరిణామంతో ఉలిక్కిపడ్డ కిరణ్ బైగా మిగతా ఇద్దరు పిల్లల్ని ఇంట్లో పెట్టి.. తన కుమారుడిని రక్షించుకునేందుకు అడవిలోకి వెళ్ళింది. చేతిలో ఆయుధం లేకుండా కేకలు వేస్తూ పరుగులు తీసింది. తన కుమారుడిని చిరుత ఓ పొదలోకి లాక్కెళ్ళింది గుర్తించి అక్కడికి వెళ్ళింది. అడవిలో దొరికిన కర్రతో చిరుత వైపుకు దూసుకెళ్లింది. ఆమెను గమనించిన చిరుత పిల్లాడిని వదిలేసి కొద్దీ దూరం వెళ్ళింది. ఆ తర్వాత తిరిగి వచ్చి మహిళపై దాడి చేసింది.
చదవండి : Madhya Pradesh : ఆవుల పేడ, మూత్రంతో ఆర్థిక వ్యవస్థకు ఊతం శివరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
చేతులో ఉన్న కర్రతో కొద్దీ నిమిషాల పాటు చిరుతను నిలువరించింది కిరణ్ బైగా.. ఈ లోపే గ్రామస్తులకు విషయం తెలియడంతో వారు వెతుక్కుంటూ అడవిలోకి వచ్చారు. గ్రామస్తులను గుంపుగా వస్తున్న జనాలను చూసి భయపడిన చిరుత అక్కడి నుంచి పారిపోయింది. ఈ ఘటనలో పిల్లాడు రాహుల్ కు స్వల్ప గాయాలు కాగా.. కిరణ్ బైగా చేతికి బలమైన గాయమైంది. దీంతో ఆమెను స్థానిక ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు.
చదవండి : Madhya Pradesh : భోపాల్లో దుర్గామాత భక్తులపై దూసుకెళ్లిన కారు
ఇక విషయం అటవీ అధికారులకు తెలియడంతో ఆమె సాహసాన్ని ప్రశంసించి.. తక్షణ సాయం కోసం ఆమెకు వెయ్యి రూపాయలు ఇచ్చారు.
The woman of the village saved her little child from the leopard, this would have been the mother of real India (the land of Shivaji Maharaj)
Not like today’s gentle mother who is busy eating pizza burger and her lust, who shouts help me help me every time. #IndianMother pic.twitter.com/o5V0VRhvtZ— Odd-Purush (Odd Man) (@prevaildatruth) December 1, 2021