Nun Rape Case : క్రైస్తవ సన్యాసిని రేప్ కేసులో బిషప్‌ను నిర్దోషిగా తేల్చిన కోర్టు

క్రైస్తవ సన్యాసిని పై రేప్ చేసిన కేసులో మాజీ బిషప్ ఫ్రాంకో ములక్కల్ నిర్దోషి అని కొట్టాయంలోని జిల్లా సెషన్స్ కోర్టు తేల్చింది.

Nun Rape Case : క్రైస్తవ సన్యాసిని రేప్ కేసులో బిషప్‌ను నిర్దోషిగా తేల్చిన కోర్టు

Kerala Bishop Franco Mulakkal

Nun Rape Case :  క్రైస్తవ సన్యాసినిని  రేప్ చేసిన కేసులో మాజీ బిషప్ ఫ్రాంకో ములక్కల్ నిర్దోషి అని కొట్టాయంలోని జిల్లా సెషన్స్ కోర్టు తేల్చింది.  2014 నుంచి 2016 మధ్య కాలంలో ఓ నన్ పై అత్యాచారం చేసినట్లు ఫ్రాంకో ములక్కల్ పై పై ఆరోపణలు వచ్చాయి. సంచలనం రేపిన ఈకేసులో   కోర్టు తీర్పును వెలువరించింది.

దాదాపు 100 రోజుల పాటు జరిగిని విచారణ అనంతరం ములక్కల్ నిర్దోషి అని కోర్టు తేల్చి చెప్పింది. అత్యాచారం కేసులో సరైన సాక్ష్యాధారాలు లేవని కోర్టు అభిప్రాయ పడింది.  జస్టిస్ జీ. గోపకుమార్ ఈకేసులో   సింగిల్ లైన్ తీర్పునిస్తూ… ఫ్రాంకోపై మోపిన అభియోగాలన్నింటి నుంచి రిలీఫ్ కల్పిస్తున్నట్లు పేర్కోన్నారు.

జలంధర్ డయోసిస్‌లో   ములక్కల్ బిషప్ గా పని చేశారు. కురవిలంగాడ్ లోని మిషనరీస్ ఆఫ్ జీసస్ కాన్వెంట్ లోని  సన్యాసిని 2014-16 మధ్య కాలంలో కాన్వెంట్‌కు  వెళ్లిన తనపై 13 సార్లు బిషప్ ములక్కల్ అత్యాచారం చేశారని బాధితురాలు 2018 లో కొట్టాయం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు 2018 అక్టోబర్‌లో   బిషప్‌ను   అరెస్ట్ చేసి అక్రమ నిర్భంధం, రేప్, అసహజ శృంగారం, నేర ప్రవృత్తి కింద కేసులు నమోదు చేసి కోర్టులో 2000 పేజీల చార్జి షీట్‌ను   దాఖలు చేశారు. అక్టోబర్ 15, 2018‌న   బిషప్ ములక్కల్ బెయిల్ పై విడుదల అయ్యారు.

Also Read : Corona Virus : ఏపీ, తెలంగాణ గ్రామాలపై కరోనా పంజా.. పండగల ప్రయాణాలతో పెరిగిన కేసుల ఉధృతి

2019 నవంబర్ నుంచి కేసులో విచారణ మొదలయ్యింది. దాదాపు 39 మంది ఈ కేసులో సాక్ష్యం చెప్పగా… ఒక్కరు కూడా సరైన ఆధారాలను కోర్టుకు సమర్పించలేకపోయారు. జనవరి 10 విచారణ ముగిసింది. ఈ కేసులో కోర్టు అనుమతితో మీడియాకు సమాచారాన్ని ఇచ్చారు.