Murdered : భార్యపై అనుమానం.. ఇద్దరి ప్రాణాలు తీసింది

నెల్లూరు జిల్లా అంబటివారిపాలేనికి చెందిన ఓ మహిళతో అదే జిల్లాకు చెందిన ఓ వ్యక్తితో పెళ్లైంది. కొంత కాలానికి భర్తతో విడిపోయింది.

Murdered : భార్యపై అనుమానం.. ఇద్దరి ప్రాణాలు తీసింది

Murder

man murdered two persons : అనుమానం అనే భూతం మనిషిని ఎంతకైనా దిగజార్చుతుంది. ఏం చేసేందుకైనా తెగించేలా చేస్తుంది. ఆ అనుమానమే ప్రకాశం జిల్లాలో ఓ వ్యక్తిని ఆవహించింది. పెనుభూతమై వేధించింది. దీంతో ఆ వ్యక్తి రెండుచోట్లా ముగ్గురిపై కత్తులతో దాడి చేశాడు. ఈ దాడిలో ఇద్దరు చనిపోగా.. మరొకరు ప్రాణాలతో ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్నాడు. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో జరిగిన ఈ ఘటనలు అందరినీ కలవరపాటుకు గురిచేశాయి. పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేసి విచారించగా.. ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.

నెల్లూరు జిల్లా అంబటివారిపాలేనికి చెందిన ఓ మహిళతో… అదే జిల్లాకు చెందిన ఓ వ్యక్తితో పెళ్లైంది. కొంత కాలానికి భర్తతో విడిపోయింది. ఆ తర్వాత కలిగిరి మండలం పోలంపాడుకు చెందిన రబ్బానీతో ఆ మహిళ సహజీవనం చేసింది. 8ఏళ్లుగా వీరు కలిసి ఉంటున్నారు. వీరికి ఆరేల్ల కుమారుడు కూడా ఉన్నారు.

Boy Died : బైక్‌ చక్రంలో చిక్కుకుని బాలుడు మృతి

రబ్బానీ ఒంగోలులోని 60 అడుగుల రోడ్డులో టీ దుకాణం నిర్వహిస్తున్నాడు. సత్యనారాయణపురానికి చెందిన మండ్ల కాశీకుమార్‌ అనే యువకుడిని టీ దుకాణంలో పనిలో పెట్టుకున్నాడు. అయితే కాశీకుమార్‌.. రబ్బానీ భార్యతో చనువుగా ఉండడం గమనించి అనుమానం పెంచుకున్నాడు. భార్యను పలుమార్లు హెచ్చరించాడు. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తాయి.

దీంతో ఆ మహిళ నెల్లూరులోని తన సోదరుడి ఇంటికి వెళ్లిపోయింది. దీంతో ఆమె కుటుంబంపై కక్ష పెంచుకున్నాడు. నిన్న ఉదయం అంబటివారిపాలెం చేరుకున్న రబ్బానీ… మహిళ సోదరుడి భార్య మీరమ్మతో గొడవపడ్డాడు. తన భార్య ఎక్కడ ఉందో చెప్పాలని నిలదీశాడు. అనంతరం వెంటతెచ్చుకున్న కత్తితో మీరమ్మ మెడపై నరికాడు. తల్లిపై అడ్డుకోబోయిన ఆమె కుమారుడు అక్బర్‌ ఆలీఫ్‌ను పొడిచాడు. తల్లీకుమారులు అక్కడికక్కడే చనిపోయారు.

TDP-YCP Clash : టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణ.. అమరావతిలో టెన్షన్

అంబటివారిపాలెంలో ఇద్దరిని హత్య చేసిన రబ్బానీ.. ఆ తర్వాత బైక్‌పై ఒంగోలు చేరుకున్నాడు. తన దగ్గర పనిచేసిన కాశీకుమార్‌పై మంగమ్మ కాలేజీ జంక్షన్‌ సమీపంలో దాడి చేశాడు. కత్తితో గొంతు కోశాడు. స్థానికులు అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. స్పాట్‌కు చేరుకున్న పోలీసులు రబ్బానీని అరెస్ట్‌ చేశారు. తీవ్ర గాయాలపాలైన కాశీకుమార్‌ను ఆస్పత్రికి తరలించారు.

కాశీకుమార్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. పోలీసుల తమదైన స్టైల్‌లో విచారింగా నిందితుడు రబ్బానీ క్రైమ్‌ హిస్టరీ చెప్పాడు. నెల్లూరు, ఒంగోలులో తానే దాడి చేసినట్టు అంగీకరించాడు. దీంతో నిందితుడిని పోలీసులు ఇవాళ కోర్టులు హాజరుపర్చనున్నారు.