Pooja Hegde : బుట్టబొమ్మ తర్వాత ఆ రేంజ్ హిట్ ఈ సాంగ్.. ఆ హీరో స్పెషల్ పార్టీ ఇచ్చారు..
పూజాహెగ్డే 'బీస్ట్' సినిమా గురించి మాట్లాడుతూ.. ''బీస్ట్ సినిమా పక్కా కమర్షియల్ సినిమా. ఇది తప్పకుండా ప్రేక్షకులకి నచ్చుతుంది. విజయ్‌తో సినిమా చేయాలని ఎప్పటి నుంచో కలలు.........
Pooja Hegde : ప్రస్తుతం పూజాహెగ్డే మంచి ఫామ్ లో ఉంది. వరుస సినిమాలతో, విజయాలతో బిజీబిజీగా ఉంది. పూజాహెగ్డే విజయ్ సరసన నటించిన తమిళ్ సినిమా ‘బీస్ట్’ విడుదలకి సిద్ధంగా ఉంది. ‘బీస్ట్’ సినిమా ఏప్రిల్ 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవ్వనుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా పూజాహెగ్డే ఇంటర్వ్యూలు ఇస్తుంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలని తెలియచేసింది.
పూజాహెగ్డే ‘బీస్ట్’ సినిమా గురించి మాట్లాడుతూ.. ”బీస్ట్ సినిమా పక్కా కమర్షియల్ సినిమా. ఇది తప్పకుండా ప్రేక్షకులకి నచ్చుతుంది. విజయ్‌తో సినిమా చేయాలని ఎప్పటి నుంచో కలలు కన్నాను. ‘బీస్ట్’తో అది నెరవేరింది. విజయ్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. ‘బీస్ట్’ షూటింగ్ డేస్‌ని నేను ఎప్పటికీ మర్చిపోను. షూటింగ్ టైంలో నా బర్త్‌డే ఉంటే విజయ్ అది తెలుసుకొని స్పెషల్ పార్టీ ఏర్పాటు చేశారు. అంత పెద్ద స్టార్ హీరో నాకోసం సర్ప్రైజ్ పార్టీ ప్లాన్ చేసి పార్టీ ఇవ్వడం నేను ఎప్పటికి మర్చిపోలేను. ఇక డైరెక్టర్ నెల్సన్ కి సపరేట్ స్టైల్ ఉంది. ఆయన తీసిన సినిమాలు నేను చూశాను. ఇటివల వచ్చిన ‘డాక్టర్’ సినిమా చూస్తూ బాగా నవ్వుకున్నాను” అని తెలిపింది.
Tollywood Cricket : మరోసారి టాలీవుడ్ క్రికెట్.. ఈ సారి అమెరికాలో..
ఇక ఈ సినిమాలో బాగా పాపులర్ అయిన అరబిక్ కుతూ సాంగ్ గురించి మాట్లాడుతూ.. ”అరబిక్ కుతూ పాటకు విదేశాల్లో కూడా బాగా క్రేజ్ వచ్చింది. ‘బుట్టబొమ్మ’ తర్వాత మళ్లీ ఆ రేంజ్ లో ఈ పాట పాపులర్ అయింది. అరబిక్ కుతూ పాట ఫస్ట్ టైం విన్నప్పుడే నచ్చింది కానీ ఈ రేంజ్ లో హిట్ అవుతుందని ఊహించలేదు. ఈ పాట రిలీజ్ అయ్యాక నాకు చాలా మెసేజ్ లు వచ్చాయి. చాలా మంది ఈ పాటకి మీనింగ్ ఏంటి అని అడిగారు. నాకు కూడా ఈ పాటకి మీనింగ్ తెలీదు. పాటకి అర్ధం తెలియకపోయినా ప్రేక్షకులు ఇంతలా ఆ పాటను ఆదరిస్తున్నారంటే దానికి కారణం అనిరుధ్ మ్యూజిక్ తో చేసిన మ్యాజిక్” అని తెలిపింది.