CM YS Jagan: సామాజిక న్యాయంలో సరికొత్త అధ్యయానికి శ్రీకారం చుట్టాం .. వైఎస్ఆర్ నేతన్న నేస్తం నిధులు విడుదల చేసిన జగన్

వైసీపీ ప్రభుత్వం హయాంలో అన్ని వర్గాలకూ ప్రాధాన్యత కల్పిస్తూ.. సామాజిక న్యాయంలో సరికొత్త అధ్యయానికి శ్రీకారం చుట్టామని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. గురువారం కృష్ణా జిల్లా పెడన వద్ద వైఎస్ఆర్ నేతన్న నేస్తం నాల్గవ విడత నిధులను జగన్ కంప్యూటర్ బటన్ నొక్కి విడుదల చేశారు.

CM YS Jagan: సామాజిక న్యాయంలో సరికొత్త అధ్యయానికి శ్రీకారం చుట్టాం .. వైఎస్ఆర్ నేతన్న నేస్తం నిధులు విడుదల చేసిన జగన్

Ap cm YS Jagan

CM YS Jagan: వైసీపీ ప్రభుత్వం హయాంలో అన్ని వర్గాలకూ ప్రాధాన్యత కల్పిస్తూ.. సామాజిక న్యాయంలో సరికొత్త అధ్యయానికి శ్రీకారం చుట్టామని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. గురువారం కృష్ణా జిల్లా పెడన వద్ద వైఎస్ఆర్ నేతన్న నేస్తతం నాల్గవ విడత నిధులను జగన్ బటన్ నొక్కి విడుదల చేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. తన పాదయాత్రలో నేతన్నల జీవితాలను దుర్భరంగా ఉండటాన్ని గమనించానని, అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం తీసుకొచ్చి వారికి ఆర్థికంగా దన్నుగా నిలుస్తున్నామని చెప్పారు.

YSR Nethanna Nestham: నేడు నాల్గో విడత వైఎస్ఆర్ నేతన్న నేస్తం నిధులు.. బటన్ నొక్కి విడుదల చేయనున్న సీఎం జగన్..

ఈ దేశ స్వాతంత్ర సమరాన్ని ఒక మగ్గం మార్చేసిందని, అలాంటిది మగ్గం నేసే నేతన్నలకు అండగా వైసీపీ ప్రభుత్వం నిలబడుతోందని తెలిపారు. ఈ పథకం ద్వారా ప్రతీ యేటా ఒక్కో కుటుంబానికి రూ. 24వేలు చొప్పున అందిస్తున్నామని, ప్రస్తుతం నాల్గో ఏడాది ఈ నిధులు ఇవ్వటం జరుగుతుందని సీఎం జగన్ తెలిపారు. పథకం ద్వారా లబ్ధిదారులకు 776.13 కోట్లు ఇప్పటి వరకు సాయం అందించామని జగన్ గుర్తు చేశారు. ఒక్క చేనేత మాత్రమే కాదని, అన్ని వర్గాలకు అండగా నిలుస్తున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమన్నారు.

YSR Vahana Mitra Scheme: ఆటోవాలా చొక్కా వేసుకుని.. ‘వైఎస్సార్‌ వాహన మిత్ర’ పథకాన్ని ప్రారంభించిన జ‌గ‌న్

చంద్రబాబు పవర్ లో ఉన్నప్పుడు ఒకే వర్గానికి ప్రాధాన్యం ఇచ్చారని, కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం చేస్తున్నామని, ఇందులో భాగంగా కేబినెట్ లో 70శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలే ఉన్నారని, మూడేళ్లలో నలుగురు బీసీలను రాజ్యసభకు పంపించామని జగన్ గుర్తు చేశారు. చంద్రబాబు, ఆయనకు వత్తాసు పలికేవారు తప్పుడు విమర్శలు చేయడమే పనిగాపెట్టుకున్నారని, ప్రభుత్వం మంచి కార్యక్రమాలు చేస్తూ పేదలకు అండగా నిలుస్తుంటే ఓర్వలేక పోతున్నారని జగన్ విమర్శించారు. ప్రజలు వాస్తవాన్ని గమనించాలని, అన్నివర్గాల ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని అన్నారు. అదేవిధంగా మచిలీపట్నం పోర్టుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, త్వరలో మచిలీపట్నం పోర్టు శంకుస్థాపనకు వస్తానని జగన్ అన్నారు.