ఇండియాలో కరోనా..మృతులు 1, 075 : మహారాష్ట్ర విలవిల..ఒక్కరోజే 583 కేసులు

  • Published By: madhu ,Published On : May 1, 2020 / 01:07 AM IST
ఇండియాలో కరోనా..మృతులు 1, 075 : మహారాష్ట్ర విలవిల..ఒక్కరోజే 583 కేసులు

భారతదేశాన్ని కరోనా వైరస్ ఇప్పట్లో వీడనట్లు కనిపించడం లేదు. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ప్రధానంగా మహారాష్ట్రలోనే అత్యధికంగా కేసులు నమోదవుతుండడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. 2020, ఏప్రిల్ 30వ తేదీ గురువారం ఒక్కరోజే 583 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో వైరస్ ఉధృతి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ప్రస్తుతం కేసుల సంఖ్య పది వేలు దాటింది. 10 వేల 490 కేసుల్లో ముంబాయిలో అత్యధికంగా 7 వేల 061 నమోదయ్యాయి. 1, 379 కేసులతో పూణే సెకండ్ ప్లేస్ లో ఉంది. ఇక్కడ మృతుల సంఖ్య 450 దాటినట్లు అంచనా. రాష్ట్ర వ్యాప్తంగా 733 కంటైన్ మెంట్లు జోన్లు ఉన్నాయని, కరోనా కట్టడికి కేంద్ర మార్గదర్శకాలు, నిబంధనలను అమలు చేస్తున్నామని ప్రభుత్వం వెల్లడించింది. (ఏపీలో తగ్గని కరోనా : కొత్తగా 71 కేసులు..జిల్లాల వారీగా వివరాలు)

మరోవైపు దేశంలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య గురువారానికి 1075కి చేరుకుంది. కేసుల సంఖ్య 33 వేల 610 నమోదయ్యాయి. బుధవారం సాయంత్రం నుంచి గురువారం సాయంత్రం వరకు 67 మంది చనిపోగా కొత్తగా 1, 823 కేసులు నమోదయ్యాయి.(ప్చ్..మళ్లీ పెరిగాయి : తెలంగాణలో కరోనా.. కొత్తగా 22 కేసులు)

యాక్టివ్ కేసుల సంఖ్య 24 వేల 162 కాగా..8 వేల 372 మంది వైరస్ బారిన పడి కోలుకోవడం జరిగింది కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మహారాష్ట్రలో 32 మంది, గుజరాత్‌ 16, మధ్యప్రదేశ్‌ 11, ఉత్తరప్రదేశ్‌లో ముగ్గురు, తమిళనాడు, ఢిల్లీల నుంచి ఇద్దరేసి చొప్పున చనిపోయారు.