కరోనాకు మందు కనిపెట్టి తనపైనే ప్రయోగించుకుని ప్రాణాలు కోల్పోయిన ఫార్మసిస్ట్

  • Published By: Subhan ,Published On : May 9, 2020 / 10:43 AM IST
కరోనాకు మందు కనిపెట్టి తనపైనే ప్రయోగించుకుని ప్రాణాలు కోల్పోయిన ఫార్మసిస్ట్

చెన్నైలోని ఆయుర్వేదిక్ ప్రొడక్షన్ కంపెనీ ఫార్మాసిస్ట్ కమ్ ప్రొడక్షన్ మేనేజర్ కరోనావైరస్ నిర్మూలించేందుకు మందు కనుక్కొని తనపైనే ప్రయోగించుకున్నాడు. అది వికటించడంతో ప్రాణాలు కోల్పోయాడు. చెన్నైలోని సుజాత బయోటిక్‌ లో  47 సంవత్సరాల క్వాలిఫైడ్ ఆప్తమాలజిస్ట్ పనిచేస్తున్నారు. కంపెనీలో ఆయుర్వేదిక్, హెర్బల్ ప్రొడక్ట్స్ ఉత్పత్తి అవుతుంటాయి. 

కే.శివనేశన్ అనే వ్యక్తి ఉత్తరాఖాండ్ లోని కాశిపూర్ లో పనిచేస్తున్నారు. మేనేజింగ్ డైరక్టర్ డా.రాజ్ కుమార్ ను కలిసి పలు ఉత్పత్తుల ఫార్ములాలు డిజైన్ చేసేవాడు. వీరిద్దరూ కలిసి నమ్మకంతో తమపైనే ప్రయోగం చేసుకున్నారు. మేనేజింగ్ డైరక్టర్ కమ్ ఓనర్ అయిన డా.రాజ్ కుమార్ తో కలిసి తయారుచేసిన మందును తాగారు. 

మిశ్రమాన్ని తాగిన యజమాని ఆరోగ్యం ప్రస్తుతం కుదుటగానే ఉండగా మేనేజర్ శరీరంలో వికటించి ప్రాణాలు కోల్పోయాడు. ‘వారిద్దరూ కొవిడ్-19 ను తగ్గించేందుకు తయారుచేసిన మిశ్రమంపై నమ్మకంతో తాగేశారు. శరీరంలో ప్లేట్ లెట్లను కూడా వృద్ధి చేస్తుందని భావించారు. ఇద్దరిలోనూ సమస్య మొదలవడంతో ప్రైవేట్ హాస్పిటల్ కు ట్రీట్ మెంట్ కు వెళ్లారు. శివనేశన్‌ను గురువారం రాత్రి 8గంటలకు హాస్పిటల్ కు తీసుకెళ్లగానే మృతి చెందినట్లు అధికారులు చెబుతున్నారు. 

శివనేశన్, రాజ్ కుమార్ లు గురువారం కలుసుకుని నైట్రిక్ ఆక్సైడ్, సోడియం నైట్రేట్ లతో కొవిడ్ 19మందు తయారుచేశారు. అది సక్సెస్ అయితే వారి కంపెనీ పెద్ద మొత్తంలో లాభాలు పొందుతాయని అనుకున్నారు. ప్రయోగంలో భాగంగా సబ్బులు, పెట్రోలియం రిఫైనింగ్ లో వాడే సోడియం హైడ్రేట్ ను తాగేశారు. 

Read More :

కరోనా నివారణకు ఆయుర్వేదిక్ మెడిసిన్

ప్రపంచంలో కరోనా కేసులు ఎన్నో తెలుసా