Srivari Temple : తిరుమల తరహాలో నవీ ముంబాయిలో శ్రీవారి ఆలయం.. భూమి పూజ చేసిన అర్చకులు

శ్రీవారి ఆలయ నిర్మాణానికి మహరాష్ట్ర ప్రభుత్వం 10 ఏకరాల స్థలం కేటాయించిందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. తిరుమల శ్రీవారి ఆలయం తరహాలోనే నవీ ముంబాయిలో ఆలయ నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు.

Srivari Temple : తిరుమల తరహాలో నవీ ముంబాయిలో శ్రీవారి ఆలయం.. భూమి పూజ చేసిన అర్చకులు

Srivari Temple

Navi Mumbai Srivari Temple : నవీ ముంబాయిలో శ్రీవారి ఆలయానికి అర్చకులు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి మహరాష్ట్ర సీఎం షిండే, డిప్యూటి సీఎం పడ్నవీస్, రేమాండ్స్ అధినేత సింఘానియా, చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ దర్మారెడ్డి హజరయ్యారు. తిరుమల తరహలో నవీ ముంబాయిలో శ్రీవారి ఆలయాన్ని నిర్మించడానికి టీటీడీ ముందుకు రావడాన్ని అదృష్టంగా భావిస్తూన్నామని మహరాష్ట్ర సీఎం షిండే పేర్కొన్నారు.

ఆలయ నిర్మాణంతో నవీ ముంబాయి ఆర్థికంగా ముందుకు వెళుతుందని భావిస్తున్నామని తెలిపారు. ఆలయానికి సమీపంలోని తీర ప్రాంతం నుంచి నిర్మిస్తోన్న అతి పెద్ద బ్రిడ్జితో కోల్హాపూర్ లక్ష్మి అమ్మవారి ఆలయానికి అనుసంధానం చేస్తామని చెప్పారు.

Rajasthan : ఇదేం ప్రేమరా బాబు .. వధువును కిడ్నాప్ చేసి ఎడారిలో ’ఏడు అడుగులు’..

ఆలయ నిర్మాణానికి టీటీడీకి పూర్తిగా సహకరిస్తమని వెల్లడించారు.  తిరుమల వెళ్ళి స్వామివారిని దర్శించుకోలేని భక్తులకు…. నవీ ముంబాయిలో నిర్మిస్తున్న ఆలయంలో స్వామివారిని దర్శించుకునే అదృష్టం లభిస్తుందన్నారు.

శ్రీవారి ఆలయ నిర్మాణానికి మహరాష్ట్ర ప్రభుత్వం 10 ఏకరాల స్థలం కేటాయించిందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. తిరుమల శ్రీవారి ఆలయం తరహాలోనే నవీ ముంబాయిలో ఆలయ నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. రెండు సంవత్సరాల కాల వ్యవధిలో ఆలయ నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు.