Bhopal: ప్రభుత్వ కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం.. రంగంలోకి వైమానిక దళం.. బీజేపీ కుట్రలో భాగమేనంటూ కాంగ్రెస్ విమర్శలు

మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ చౌహాన్ అగ్నిప్రమాదం విషయంపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ఫోన్ లో మాట్లాడి పరిస్థితిని వివరించారు. అవసరమైన సహాయం కోరారు. ఈ విషయాన్ని సీఎం ట్విటర్ ద్వారా తెలిపారు.

Bhopal: ప్రభుత్వ కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం.. రంగంలోకి వైమానిక దళం.. బీజేపీ కుట్రలో భాగమేనంటూ కాంగ్రెస్ విమర్శలు

Government office in Bhopal

Madhya Pradesh: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సత్పురా భవనంలో సోమవారం సాయంత్రం 4గంటల సమయంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు మూడవ అంతస్తు నుండి ప్రారంభమై ఆరో అంతస్తుకు వేగంగా వ్యాపించాయి. కొద్దిసేపటికే భవనం మొత్తం మంటలు వ్యాపించాయి. ఈ ప్రభుత్వ భవనంలో సీబీఐ, ఈఓడబ్ల్యూ, గిరిజన సంక్షేమం, ఆరోగ్యశాఖ, రవాణాశాఖ సహా పలు ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. అర్థరాత్రి వరకు ఈ మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు జరిగాయి. అయిన మంటలు అదుపులోకి రాకపోవటంతో ఆర్మీ రంగంలోకి దిగింది. మంగళవారం ఉదయం వరకు మంటలు అదుపులోకి వచ్చాయి. ఈ అగ్ని ప్రమాద ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

Delhi Suns : ఢిల్లీలో భానుడి భగభగలు.. ఉదయం 7 గంటలకే 33 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

భవనంలో అగ్నిప్రమాదం తీవ్రత గంటగంటకు పెరగడంతో సోమవారం అర్థరాత్రి వరకు మంటలు అదుపులోకి రాలేదు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ చౌహాన్ అగ్నిప్రమాదం విషయంపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ఫోన్ లో మాట్లాడి పరిస్థితిని వివరించారు. అవసరమైన సహాయం కోరారు. ఈ విషయాన్ని సీఎం ట్విటర్ ద్వారా తెలిపారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పరిస్థితిని చర్చించిన తరువాత వైమానిక దళ సహాయాన్ని కోరవటం జరిగిందని సీఎం తెలిపారు. రక్షణ మంత్రి ఆదేశాల మేరకు మంటలను అదుపు చేసేందుకు ఒక ఏఎన్-32 విమానం, ఎంఐ 15 హెలికాప్టర్ ను పంపించినట్లు సీఎం శివరాజ్ చౌహాన్ తెలిపారు. అగ్ని ప్రమాదం సంభవించిన తరువాత తొలుత ఫైర్ సిబ్బంది 30 నుంచి 40 వాటర్ ట్యాంకర్లను తరలించి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. అర్థరాత్రి తరువాత అగ్నిమాపక సిబ్బంది,  వైమానిక దళం సంయుక్తంగా మంటలను ఆర్పేందుకు ప్రయత్నించాయి. మంగళవారం ఉదయం వరకు మంటలు అదుపులోకి వచ్చాయి.

Fire Accident : కూకట్‎పల్లి వై జంక్షన్ వద్ద తప్పిన పెను ప్రమాదం

ఈ భవనంలో ఎగిసిపడిన మంటలను అదుపు చేయడానికి 14గంటలు శ్రమించారు. ఈ అగ్ని ప్రమాదంలో ప్రాణనష్టం జరగలేదు. అయితే, ప్రభుత్వానికి సంబంధించి కీలక పత్రాలు దగ్దమైనట్లు తెలిసింది. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సత్పురా భవన్ లో అగ్నిప్రమాదానికి ప్రాథమిక కారణాలను తెలుసుకోవటానికి ఒక కమిటీని ప్రకటించారు. ఈ కమిటీ సభ్యులు విచారణ జరిపి ప్రాథమిక నివేదికను సీఎంకు అందజేయనున్నారు.

 

 

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకోవటంపై కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. బీజేపీప్రభుత్వంలో అవినీతికి సంబంధించిన సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు ఈ అగ్నిప్రమాదం జరిగిందని ఆరోపించారు. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ నేత అజయ్ సింగ్ మాట్లాడుతూ.. ఉద్దేశపూర్వకంగా ఈ అగ్నిప్రమాదం జరిగిందని ఆరోపించారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తరువాత అగ్నిప్రమాదం వెనుక ఉన్న కుట్రపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. కాంగ్రెస్ నేతల ఆరోపణలపై బీజేపీ నేతలు ఘాటుగా స్పందించారు. బీజేపీ అధికార ప్రతినిధి హితేష్ బాజ్ పాయ్ మాట్లాడుతూ.. వారి ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి అంటూ కొట్టిపారేశారు. అనుకోకుండా జరిగిన అగ్నిప్రమాదం విషయంలోనూ కాంగ్రెస్ నేతలు రాజీనామా చేస్తుండటం సిగ్గుచేటని, ఇది దురదృష్టకరం అని అన్నారు.