Nikhil Siddhartha : నాకు చాలా సార్లు డ్రగ్స్ ఆఫర్ చేశారు.. నిఖిల్ వ్యాఖ్యలు

హీరో నిఖిల్ మాట్లాడుతూ.. సినిమాల్లోకి రాకముందు చాలా సార్లు నాకు డ్రగ్స్ తీసుకోమని కొంతమంది ఆఫర్ చేశారు. కానీ నేను తీసుకోలేదు. తీసుకొని ఉంటే హ్యాపీడేస్ వచ్చేది కాదు. ఆ తర్వాత కూడా............

Nikhil Siddhartha : నాకు చాలా సార్లు డ్రగ్స్ ఆఫర్ చేశారు.. నిఖిల్ వ్యాఖ్యలు

Nikhil Siddhartha sensational comments on Drugs

Nikhil Siddhartha :  డ్రగ్ దుర్వినియోగం & డ్రగ్స్ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో నేడు ఓ కార్యక్రమం నిర్వహించగా ఈ కార్యక్రమానికి నటులు నిఖిల్ సిద్దార్థ, ప్రియదర్శి పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ సి.వి.ఆనంద్, పలువురు పొలిసు అధికారులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో హీరో నిఖిల్ మాట్లాడుతూ.. సినిమాల్లోకి రాకముందు చాలా సార్లు నాకు డ్రగ్స్ తీసుకోమని కొంతమంది ఆఫర్ చేశారు. కానీ నేను తీసుకోలేదు. తీసుకొని ఉంటే హ్యాపీడేస్ వచ్చేది కాదు. ఆ తర్వాత కూడా అడిగారు, అప్పుడు కూడా అతీసుకొని ఉంటే కార్తికేయ 2 వచ్చేది కాదు. పేరెంట్స్ కూడా పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళని గమనించాలి. డ్రగ్స్ కి అందరూ దూరంగా ఉండాలి. నార్కోటిక్స్ కి అలవటు పడితే అదే డెత్ సెంటన్స్. సే నో టూ డ్రగ్స్. స్టూడెంట్స్ కు ఎంతో భవిష్యత్ ఉంది. పార్టిస్ కి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి, కానీ డ్రగ్ తీసుకోకండి. త్వరలో డ్రగ్ ఫ్రీ తెలంగాణ అవ్వాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

ఇక నటుడు ప్రియదర్శి మాట్లాడుతూ.. 10 ఏండ్ల క్రితం నేను సిగరెట్ తాగాను. దానికి బానిస కావొద్దు అనుకున్నాను. కొంత కాలం తర్వాత నాలో మార్పు వచ్చి సిగరెట్ మానేశాను. ఇప్పుడు ఎలాంటి హెల్త్ ఇష్యూష్ లేకుండా హ్యాపీగా ఉన్నాను. డ్రగ్స్ వినియోగంపై అందరికి అవగాహన రావాల్సిన అవసరం ఉంది. విద్యార్థులకు ఇలాంటి అవేర్‌నెస్ ప్రోగ్రాం నార్కోటిక్స్ విభాగం చేయడం సంతోషంగా ఉంది. విద్యార్థుల్లో కూడా పరివర్తన రావాల్సిన అవసరం ఉంది. నార్కోటిక్స్ వింగ్ పోలీసులకు నా సెల్యూట్ అని తెలిపారు.

Dil Raju : నా దగ్గర డబ్బులు తక్కువగా ఉన్నప్పుడల్లా తొలిప్రేమ రీ రిలీజ్ చేసేవాడ్ని.. దిల్ రాజు వ్యాఖ్యలు..

ఇక హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో కొద్దిరోజుల క్రితమే ప్రారంభించము. డ్రగ్స్ అనేది ప్రస్తుత సమాజంలో పెద్ద సమస్యగా మారింది. ఇండియాలో 11.50 కోట్ల మంది డ్రగ్స్ కు బానిసలయారు. ఆఫగానిస్థాన్, పాకిస్థాన్ నుండి వివిధ రకాలుగా డ్రగ్స్ ఇక్కడికి చేరవేస్తున్నారు. సైబర్ క్రైమ్, నార్కోటిక్స్ రెండు ప్రధాన సమస్యలు. ఎంతో మంది విద్యార్థులు డ్రగ్స్ కు ఎడిక్ట్ అవుతున్నారు. ఈ పరివర్తన కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో మార్పు రావాలి. డ్రగ్స్ నిర్ములనకు అందరూ పోలీసులు సహకరించాలి అని అన్నారు.