Benefits Of Fermented Foods : ప్రేగు ఆరోగ్యం కోసం పులియబెట్టిన ఆహారాలు తీసుకోవటం వల్ల ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది !

రోగనిరోధక శక్తిని పెంచేందుకు పులియబెట్టిన ఆహారాలు సహాయపడతాయి. వీటిలో ఉండే అధిక ప్రోబయోటిక్ కంటెంట్ జలుబు,దగ్గు వంటి ఇన్ఫెక్షన్ల ముప్పులేకుండా రక్షిస్తాయి.

Benefits Of Fermented Foods : ప్రేగు ఆరోగ్యం కోసం పులియబెట్టిన ఆహారాలు తీసుకోవటం వల్ల ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది !

Fermented Foods

Benefits Of Fermented Foods : పులియబెట్టిన ఆహారాలు ప్రేగులో మంచి బ్యాక్టీరియాను పెంపొందించటానికి సహాయపడతాయి. దీనిని గట్ బయోమ్ గా పిలుస్తారు. ఆహారంలో పులియబెట్టిన చేర్చడం వలన ఆరోగ్యకరమైన మైక్రోబయోమ్‌ను నిర్వహించటంతోపాటు, వ్యాధులు దరిచేరకుండా చూసుకోవచ్చు.

READ ALSO : Increase Intestinal Health : ప్రేగు ఆరోగ్యాన్ని పెంచడానికి దోహదపడే రోజువారీ అలవాట్లు !

రోజువారిగా తినే ఆహారం కడుపులోని అన్ని జీర్ణ రసాలు, ఎంజైమ్‌లు ,ఆమ్లాలతో కలిసిపోయి చిన్న అణువులుగా విభజించ బడుతుంది. ఈ చిన్న అణువులు విచ్ఛిన్నంతరువాత ఆరోగ్యకరమైన శరీర పనితీరుకు అవసరమైన పోషకాలుగా విచ్ఛిన్నం చేయటానికి ప్రోబయోటిక్స్ తోడ్పడతాయి.

READ ALSO : Popcorn : పాప్‌కార్న్ ఆరోగ్యకరమా? పేగుల పనితీరును మెరుగుపర్చి జీర్ణ ప్రక్రియ సాఫీగా చేయటంలో!

రోగనిరోధక శక్తిని పెంచేందుకు పులియబెట్టిన ఆహారాలు సహాయపడతాయి. వీటిలో ఉండే అధిక ప్రోబయోటిక్ కంటెంట్ జలుబు,దగ్గు వంటి ఇన్ఫెక్షన్ల ముప్పులేకుండా రక్షిస్తాయి. పులియబెట్టిన ఆహారాలలో విటమిన్ సి, ఐరన్ , జింక్ అధికంగా ఉండి రోగనిరోధక వ్యవస్థ మెరుగ్గా ఉంటుంది.

READ ALSO : Bowel Cancer : ప్రేగు క్యాన్సర్ సంకేతాలు, లక్షణాలు !

ఆందోళన , నిరాశ వంటి మానసిక ఆరోగ్య రుగ్మతలను దూరం చేసేందుకు దోహదం చేస్తాయి. పులియబెట్టిన ఆహారాలు ఆందోళన, నిరాశను కలగటానికి కారణమయ్యే కొన్ని సూక్ష్మజీవుల స్థాయిలను తగ్గించడం ద్వారా గట్ ఇన్ఫ్లమేషన్ తగ్గించి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో తోడ్పడతాయి.

READ ALSO : Orange : గర్భిణీ స్త్రీలకు దివ్యౌషదం నారింజ ! పేగు ఆరోగ్యానికి మేలే!

పులియబెట్టిన పెరుగు, పుల్లని రొట్టె, మిసో, సౌర్‌క్రాట్ వంటి ఆహారాలు పేగులలో మంచి బ్యాక్టీరియాను పెంపొందేలా చేస్తాయి. ఈ బ్యాక్టీరియా వ్యాధి కారక సూక్ష్మజీవులను నిరోధిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంపొందిచటంతోపాటుగా, వీటిలో ఉండే ఫైబర్ జీర్ణ శక్తిని పెంపొందిస్తాయి. ప్రేగులను శుభ్రంగా ఉంచడంలో సహాయపడతాయి.