CPI Narayana : మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకే కామన్ సివిల్ కోడ్ తెరపైకి : నారాయణ

మణిపూర్ దహనం అవుతుందంటే అందుకు కారణం మోదీ విధానాలేనని ఆరోపించారు. రెండు వర్గాల మధ్య చిచ్చుపెట్టి అల్లర్లు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీ మణిపూర్ నుంచే రాజకీయం మొదలు పెట్టిందన్నారు.

CPI Narayana : మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకే కామన్ సివిల్ కోడ్ తెరపైకి : నారాయణ

CPI Narayana (1)

Common Civil Code : దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకే కామన్ సివిల్ కోడ్ ను తెర పైకి తెస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ పేర్కొన్నారు. దేశంలో అనేక మతాల వారు ఉన్నారని తెలిపారు. దేశ ఐక్యతను విచ్ఛిన్నం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని వెల్లడించారు. కామన్ సివిల్ కోడ్ తో ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఈ మేరకు ఆయన శనివారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు.

మణిపూర్ దహనం అవుతుందంటే అందుకు కారణం మోదీ విధానాలేనని ఆరోపించారు. రెండు వర్గాల మధ్య చిచ్చుపెట్టి అల్లర్లు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీ మణిపూర్ నుంచే రాజకీయం మొదలు పెట్టిందన్నారు. మణిపూర్ అటవీ సంపదని దోచుకునేందుకు మోదీ సర్కార్ ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. శవపేటికల మీద చిల్లర ఏరుకునే విధంగ మోదీ విధానాలు ఉన్నాయని సంచలన ఆరోపణలు చేశారు.

Teesta Setalvad: వెంటనే లొంగిపొమ్మంటూ యాక్టివిస్ట్ తీస్తా సెతల్వాద్‭కు హైకోర్టు ఆదేశాలు

దేశంలో బీజేపీ వ్యతిరేక శక్తులతో తాము కలిసి పని చేస్తామని స్పష్టం చేశారు. తమిళసై తెలంగాణ గవర్నర్ గా ఉంటూ.. పాండిచ్చేరి ఇన్ చార్జిగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. పాండిచ్చేరి లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత అక్కడ 250 డిస్కో పబ్బులకు అనుమతి ఇచ్చారని ఆరోపించారు. అవినాష్ రెడ్డికి మాత్రం బెయిల్ వస్తోంది కానీ, మనీశ్ సిసొడియాకు మాత్రం బెయిల్ రాదన్నారు. గవర్నర్ లు వాళ్ళ పరిధిని దాటుతున్నారని వెల్లడించారు.

మోదీ విధానాలు దేశానికి ప్రమాదకరమని, వాటిని ప్రజలు గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. విభజన చట్టంలో హామీలు అమలు చేయని మోదీ రాష్ట్రానికి ఏ మొహం పెట్టుకొని వస్తున్నారని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ లో మూడు ప్రధాన పార్టీలు మోదీకి జై అంటున్నాయని తెలిపారు. దేశంలో ఆయా రాష్ట్రాల రాజకీయ పరిస్థితులను బట్టి పొత్తులపై ఆలోచిస్తున్నామని వెల్లడించారు.

Guinness World Records : ఒంటిపై మంటలతో 100 మీటర్లు పరుగెత్తిన ఫైర్ ఫైటర్.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో పేరు నమోదు

మారుమూల ప్రాంతంలో లక్ష మందితో సీపీఐ బహిరంగ సభ నిర్వహించిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో చేరే పొంగులేటి.. ఖమ్మంలో ఎన్ని కోట్లు ఖర్చుపెట్టి సభ నిర్వహిస్తున్నారో చెప్పాలన్నారు. శ్రీలంకలో శ్రీలంక కమ్యూనిస్టు పార్టీ 80వ జాతీయ వారోత్సవాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా నుంచి ముగ్గురు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరుకానున్నామని తెలిపారు.