Delhi Metro : ఢిల్లీ మెట్రోలో యువకుడిని తిట్టి, చెంప దెబ్బ కొట్టిన మహిళ వీడియో వైరల్

ఢిల్లీ మెట్రో రోజూ వార్తల్లో ఉంటుంది. తాజాగా ఓ యువకుడిని మహిళ తిట్టి, చెంప దెబ్బ కొట్టిన వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై మెట్రో అధికారులు స్పందించారు.

Delhi Metro : ఢిల్లీ మెట్రోలో యువకుడిని తిట్టి, చెంప దెబ్బ కొట్టిన మహిళ వీడియో వైరల్

Delhi Metro

Delhi Metro : ఢిల్లీ మెట్రో అంటే రోజు ఏదో ఒక వార్త ఉండాల్సిందే. అంతగా ఫేమస్ అయ్యింది. నిత్యం ఇక్కడ ప్రయాణికుల మధ్య గొడవలు, కొట్టుకోవడాలు, రీల్స్, డ్యాన్స్ ల హంగామా ఉంటుంది. వీరి చర్యలతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. తాజాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Guinness World Records : 15 గంటలు.. 286 స్టేషన్లు.. ఢిల్లీ మెట్రోలో ప్రయాణించి వరల్డ్ రికార్డ్ సాధించిన శశాంక్ మను

ఢిల్లీ మెట్రోలో వివాదాలు కొత్త కాదు. తాజాగా ఓ మహిళ ఓ వ్యక్తిపై అరుస్తూ చెంప మీద కొట్టిన వీడియో వైరల్ అవుతోంది. @gharkekalesh అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన  వీడియోలో మహిళ తన పక్కన ఉన్న యువకుడితో వాగ్వాదానికి దిగింది. తరువాత చెంప దెబ్బ కొట్టింది. వాగ్వాదానికి కారణం అయితే తెలియలేదు. తోటి ప్రయాణికులు ఈ ఘటనను చూస్తూ ఊరుకున్నారు. ఈ వీడియోపై చాలామంది నెటిజన్లు స్పందించారు. చుట్టుపక్కల వారు ఈ ఘటనపై జోక్యం చేసుకోకపోవడాన్ని ఎత్తి చూపారు.

Delhi Metro : మెట్రో రైల్లో మద్యం బాటిల్స్ తీసుకెళ్లేందుకు అనుమతి

‘చుట్టుపక్కల జరిగే ఏ సంఘటనలపై జనం స్పందించరు.. మనం ఎటువంటి ప్రపంచంలో ఉన్నాం?’ అని ఒకరు.. ‘ఆ మహిళను అతను కొట్టి ఉన్నట్లైతే ప్రజలు స్పందించేవారని’ మరొకరు వరుసగా కామెంట్లు చేశారు. ఈ ఘటనపై ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ స్పందించింది. ప్రయాణికులు మెట్రోలో ప్రయాణం చేసేటపుడు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని ప్రకటన విడుదల చేసింది.