Viral Video: అత్యంత దుర్మార్గపు చర్యకు పాల్పడ్డ బీజేపీ నేత.. పబ్లిక్‌గా గిరిజన వ్యక్తి ముఖంపై మూత్రం పోస్తూ పైశాచిక ఆనందం
సిద్ధి అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ నుంచి నేత కేదార్ నాథ్ శుక్లా గెలుపొందారు. ఆ నియోజకవర్గంలో పబ్లిక్ ప్రదేశంలో జరిగిన ఉన్మాదపు ఘటనే ఇది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ అధికార ప్రతినిధి అబ్బాస్ హఫీజ్ తన ట్విటర్లో షేర్ చేస్తూ..
![Viral Video: అత్యంత దుర్మార్గపు చర్యకు పాల్పడ్డ బీజేపీ నేత.. పబ్లిక్‌గా గిరిజన వ్యక్తి ముఖంపై మూత్రం పోస్తూ పైశాచిక ఆనందం Viral Video: అత్యంత దుర్మార్గపు చర్యకు పాల్పడ్డ బీజేపీ నేత.. పబ్లిక్‌గా గిరిజన వ్యక్తి ముఖంపై మూత్రం పోస్తూ పైశాచిక ఆనందం](https://10tv.in/wp-content/uploads/2023/07/Untitled-1-23.jpg)
Madhya Pradesh: అత్యంత దుర్మార్గమైన, అమానవీయమైన, అవమానకరమైన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాని కుదిపివేస్తోంది. భారతీయ జనతా పార్టీకి చెందిన ఒక నాయకుడు ఒక గిరిజన వ్యక్తి మీద మూత్రం పోస్తూ పైశాచిక ఆనందాన్ని పొందాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సిద్ధి జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను నెటిజెన్లు షేర్ చేస్తూ సదరు వ్యక్తిపై బీజేపీపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Caste Hindu Pravesh Shukla pissed on Tribal youth. This incident happened in Madhya Pradesh. pic.twitter.com/68Re6CvsEz
— The Dalit Voice (@ambedkariteIND) July 4, 2023
సిద్ధి అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ నుంచి నేత కేదార్ నాథ్ శుక్లా గెలుపొందారు. ఆ నియోజకవర్గంలో పబ్లిక్ ప్రదేశంలో జరిగిన ఉన్మాదపు ఘటనే ఇది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ అధికార ప్రతినిధి అబ్బాస్ హఫీజ్ తన ట్విటర్లో షేర్ చేస్తూ “ఆదివాసీల ప్రయోజనాల గురించి తప్పుడు మాటలు మాట్లాడే బీజేపీ నాయకుడు ఓ గిరిజన నిరుపేదపై ఇలా విరుచుకుపడడం చాలా ఖండనీయమైన చర్య’’ అని ట్వీట్ చేశారు.
आदिवासियों के हितों की झूठी बात करने वाली भाजपा का नेता एक आदिवासी ग़रीब व्यक्ति के ऊपर इस तरह पैशाब कर रहा है।
अति निंदनीय कृत्य।@ChouhanShivraj जी यह है आपका आदिवासी प्रेम?? इस जंगलराज को क्या कहें और भाजपा नेता की गिरफ़्तारी क्यूँ नहीं हुई ?आरोपी का नाम प्रवेश शुक्ला बताया… pic.twitter.com/ZwgeaYza5R
— Abbas Hafeez (@AbbasHafeez) July 4, 2023
ఈ ట్వీట్లో ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను ట్యాగ్ చేస్తూ “ఇదేనా మీ గిరిజన ప్రేమ? ఈ జంగిల్ రాజ్‌ని ఏమని పిలుస్తారు? ఈ బీజేపీ నాయకుడిని ఎందుకు అరెస్టు చేయలేదు? నిందితుడి పేరు ప్రవేశ్ శుక్లా. బీజేపీ ఎమ్మెల్యే కేదార్ నాథ్ శుక్లా నియోజకవర్గం వాడు. గిరిజన యువకులపై మూత్ర విసర్జన ఇలాంటి నిందితులు భాజపాకు చెందిన ప్రముఖ నేతలతో కలిసి తిరుగుతారు’’ అని అన్నారు.