Narendra Modi : రేపే తెలంగాణకు ప్రధాని మోదీ.. వరంగల్ టూర్ షెడ్యూల్ ఖరారు

Narendra Modi : వరంగల్ పర్యటనలో పలు శంకుస్థాపన కార్యక్రమాల్లో మోదీ పాల్గొననున్నారు.

Narendra Modi : రేపే తెలంగాణకు ప్రధాని మోదీ.. వరంగల్ టూర్ షెడ్యూల్ ఖరారు

Narendra Modi (Photo : Twitter)

Modi – Warangal Tour L ప్రధాని మోదీ తెలంగాణకు రానున్నారు. ఈ నెల 8న రాష్ట్రానికి వస్తారు. ప్రధాని వరంగల్ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. శనివారం ఉదయం హకీంపేట్ ఎయిర్ పోర్టుకు ప్రధాని మోదీ చేరుకుంటారు. హకీంపేట్ నుంచి హెలికాప్టర్ లో వరంగల్ కు వెళ్తారు. అనంతరం ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లోనే శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ పక్కనే బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారు.

* శనివారం తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన
* ఉ.9:45కు ప్రత్యేక విమానంలో హకీంపేట్ ఎయిర్‌పోర్టుకు మోదీ
* ఉ9:50కు హెలికాప్టర్‌లో వరంగల్‌కు వెళ్తారు
* ఉ.10:35కి వరంగల్‌కు చేరుకోనున్న ప్రధాని మోదీ
* ఉ.10:45కు శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొననున్న మోదీ
* ఉ.11:30కు బీజేపీ సభలో పాల్గొననున్న ప్రధాని
* 40 నిమిషాల పాటు సభలో పాల్గొంటారు
* మ.12:25కు వరంగల్‌ నుంచి హైదరాబాద్‌కు పయనం
* మ. 1:10కు తిరిగి హకీంపేట్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు
* హకీంపేట్ నుంచి రాజస్థాన్‌కు వెళ్లనున్న ప్రధాని మోదీ

Also Read..Telangana BJP : బీజేపీకి వరుస షాక్‌లు..? ఏనుగు రవీందర్ రెడ్డి బాటలో మరికొందరు..! కేసీఆర్‌ను ఓడించడం కష్టమని..

వరంగల్ పర్యటనలో భాగంగా 500 కోట్ల రూపాయలతో కాజీపేటలో రైల్వే తయారీ యూనిట్‌‌‌‌కు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. రూ. 5,550 కోట్ల విలువైన 176 కిలోమీటర్ల పొడవైన నేషనల్ హైవే ప్రాజెక్టులకు ఫౌండేషన్ స్టోన్ వేస్తారు. ఇందులో నాగ్‌‌‌‌పూర్-విజయవాడ కారిడార్‌‌‌‌లోని 108 కిలోమీటర్ల మేర మంచిర్యాల-వరంగల్ సెక్షన్ లో ఈ ప్రాజెక్ట్​లు ఉన్నాయి.

ప్రధాని రాక నేపథ్యంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వరంగల్ కు వెళ్లనున్నారు. ఇవాళ పొద్దున వరంగల్ కు చేరుకుంటారు. రేపు పొద్దున భద్రకాళి దేవాలయంలో పూజలు నిర్వహిస్తారు. అనంతరం మోడీ సభ నిర్వహించే హనుమకొండ ఆర్ట్స్ కాలేజి గ్రౌండ్ కు కిషన్ రెడ్డి వెళ్తారు. గ్రౌండ్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత హరిత హోటల్ లో కిషన్ రెడ్డి బస చేస్తారు. రెండు రోజులు పాటు ఆయన వరంగల్ లోనే ఉండనున్నారు.

Also Read..Eatala Rajender : నాకు పదవి ఇవ్వడానికి ప్రధాన కారణం అదే- ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు