Ola Prime Plus Service : ఓలా ‘ప్రైమ్ ప్లస్’ సర్వీస్‌.. ఇక నో క్యాన్సిలేషన్.. బెంగళూరులో పూర్తి స్థాయిలో ప్రారంభం!

Ola Prime Plus Service : ఓలా కొత్త ప్రీమియం సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రైమ్ ప్లస్ సర్వీసు పేరుతో ఓలా బెంగళూరులో పూర్తి స్థాయిలో సర్వీసును ప్రారంభించింది. ఈ జూలైలో మరిన్ని నగరాల్లో విస్తరించనుంది.

Ola Prime Plus Service : ఓలా ‘ప్రైమ్ ప్లస్’ సర్వీస్‌.. ఇక నో క్యాన్సిలేషన్.. బెంగళూరులో పూర్తి స్థాయిలో ప్రారంభం!

Ola to roll out premium service Prime Plus to more users

Ola Prime Plus Service : ప్రముఖ ఓలాక్యాబ్స్(Olacabs) కంపెనీ ఓలా (Ola) కొత్త ప్రీమియం సర్వీస్‌ను ప్రైమ్ ప్లస్ (Prime Plus) పేరుతో ప్రారంభించింది. ఈ ప్రీమియం సర్వీసుతో ఎలాంటి క్యాన్సిలేషన్ రద్దు లేదా కార్యకలాపాల సమస్యలు లేకుండా వస్తుందని కంపెనీ పేర్కొంది. ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ (CEO Bhavish Aggarwal) ఈ కొత్త సర్వీస్‌ను ట్విట్టర్‌ వేదికగా ప్రకటించారు. బెంగుళూరులో ఎంపిక చేసిన యూజర్లకు ఈ సర్వీసు ప్రస్తుతం అందుబాటులో ఉంది.

తర్వలో ఇతర నగరాలకు విస్తరిస్తుందని భావిస్తున్నారు. ఓలా తమ కస్టమర్‌లకు ఎలాంటి అంతరాయం లేని ప్రయాణాన్ని అందించడానికి ఈ కొత్త ప్రీమియం ‘ప్రైమ్ ప్లస్‌’ సర్వీసును ప్రారంభించినట్టు ఆయన పేర్కొన్నారు. బెంగళూరులో పూర్తి స్థాయిలో ప్రైమ్ ప్లస్ సర్వీసును ప్రారంభించినట్లు అగర్వాల్ ప్రకటించారు. ఇటీవలే పైలట్ ప్రోగ్రామ్ సక్సెస్ కావడంతో ఓలా ఈ దిశగా నిర్ణయాన్ని తీసుకుంది.

Read Also : Hyundai Exter Launch : కొంటే ఇలాంటి కారు కొనాలి.. హ్యుందాయ్ ఎక్స్‌టర్‌ వచ్చేసిందోచ్.. ధర కేవలం రూ. 6 లక్షలు మాత్రమే.. త్వరపడండి..!

ప్రైమ్ ప్లస్‌ సర్వీసు ద్వారా ఓలా ప్రొఫెషనల్ డ్రైవర్లతో అసాధారణమైన రైడ్ హెయిలింగ్ అనుభవాన్ని అందించనుంది. రైడ్ కాన్సలేషన్స్, కార్యాచరణ ఇబ్బందులను తొలగించనుంది. జూలై 10 నుంచి బెంగళూరు వ్యాప్తంగా ప్రైమ్ ప్లస్ సర్వీసు వినియోగదారులందరికీ అందుబాటులోకి వచ్చింది. ఈ నెలలో మరిన్ని నగరాల్లో ప్రైమ్ స్లస్ సర్వీసును మరింత విస్తరించాలని ఓలా భావిస్తోంది. బెంగుళూరులో ప్రైమ్ ప్లస్ పైలట్ అద్భుతమైన విజయాన్ని సాధించగా.. కస్టమర్లను మరింత ఆకట్టుకునేలా సర్వీసులను విస్తరించాలని కంపెనీ భావిస్తోంది.

Ola to roll out premium service Prime Plus to more users

Ola to roll out premium service Prime Plus to more users

బెంగుళూరులో పూర్తి స్థాయిలో సర్వీసులను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని, దేశవ్యాప్తంగా ఇతర నగరాలకు క్రమంగా సర్వీసులను విస్తరిస్తామని సీఈఓ అగర్వాల్ పేర్కొన్నారు. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఓలా తమ సర్వీసులను మెరుగుపరుస్తుందని ఓలా ప్రతినిధి ఒకరు తెలిపారు. 2011లో ఓలాక్యాబ్స్ సర్వీసులను ప్రారంభించిన ఓలా.. ప్రపంచంలోని కొన్ని లాభదాయకమైన యూజర్ ఇంటర్నెట్ కంపెనీలలో ఒకటిగా అవతరించింది.

దేశ మార్కెట్ లీడర్‌గా మాత్రమే కాదు.. 200 నగరాల్లో కార్యకలాపాలు, ప్లాట్‌ఫారమ్‌లో ఒక మిలియన్ కన్నా ఎక్కువ డ్రైవర్లతో దేశంలోనే అతిపెద్ద రైడ్-హెయిలింగ్ నెట్‌వర్క్‌ను ఓలా విస్తరించింది. ప్రస్తుతం, ఓలా తన యాప్‌లో మినీ, ఆటో, బైక్‌తో సహా పలు సర్వీసులను అందిస్తుంది. అయితే, వినియోగదారులు నిర్దిష్ట అవసరాల కోసం ప్రైమ్ సెడాన్, ప్రైమ్ SUV, రెంటల్స్‌ను బుక్ చేసుకోవచ్చు. ఓలా ప్లాట్‌ఫారమ్‌లో నిరూపితమైన ట్రాక్ రికార్డ్‌ను కలిగి ఉన్న డ్రైవర్‌లు, టాప్ రేటింగ్‌లు ఇతర క్వాలిటీ ప్రమాణాలను కలిగి ఉన్నవారు కొత్త ప్రైమ్ సర్వీసులో డ్రైవర్‌లుగా పాల్గొనడానికి అర్హులుగా కంపెనీ పేర్కొంది.

Read Also : Amazon Prime Day Sale : అమెజాన్ ప్రైమ్ డే సేల్.. ఆపిల్ ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు..!