Himachal Pradesh : జేసీబీపై విరుచుకుపడ్డ భారీ బండరాళ్లు .. ప్రాణాలతో బయటపడ్డ కార్మికులు .. వణుకు పుట్టించిన వీడియో

మనాలి-కులు జాతీయ రహదారిపై భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. వాటిని తొలగించే పనిలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న కార్మికులపై బండరాళ్లు పడటంతో పనిచేస్తున్నవారంతా తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. సరైన భద్రత లేకుండా పనిచేయిస్తున్న అధికారులపై విమర్శలు తలెత్తుతున్నాయి.

Himachal Pradesh : జేసీబీపై విరుచుకుపడ్డ భారీ బండరాళ్లు .. ప్రాణాలతో బయటపడ్డ కార్మికులు .. వణుకు పుట్టించిన వీడియో

Himachal Pradesh

Himachal Pradesh : మనాలి-కులు జాతీయ రహదారిపై భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. వాటిని తొలగించడానికి జేసీబీల సాయంతో కార్మికులు అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో శిథిలాలు ఒక్కసారిగా జేసీబీపైకి విరుచుకు పడటంతో  డ్రైవర్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. వణుకు పుట్టించిన వీడియోను IFS ఆఫీసర్ పర్వీన్ కస్వాన్ షేర్ చేశారు.

Himachal Pradesh Tourists Stuck : హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు, వరదలు.. పర్యాటక ప్రాంతాల్లో చిక్కుకున్న తెలుగు విద్యార్థితోపాటు పర్యాటకులు

జాతీయ రహదారులపై భారీ వర్షాలకు కొండచరియలు విరిగి పడుతుంటాయి. ఏ మాత్రం అప్రమత్తంగా లేకున్నా భారీ ప్రమాదాలే జరుగుతుంటాయి. మనాలి-కులు జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడటంతో దారులు మూసుకుపోయాయి. జేసీబీ సాయంతో అధికారులు వాటిని తొలగించే పనిలో పడ్డారు. అదే సమయంలో అకస్మాత్తుగా బండరాళ్లు కింద పడ్డాయి. జేసీబీపైకి దూసుకొచ్చాయి. డ్రైవర్ తృటిలో తప్పించుకోవడంతో చిన్నపాటి గాయాలతో బయటపడ్డాడు. అక్కడ పనిచేస్తున్న ఎవరికీ కూడా గాయాలు కాలేదు.

 

IFS అధికారి పర్వీన్ కస్వాన్ షేర్ చేసిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో చూస్తే భయం కలిగించింది. ప్రాణాలకు తెగించి ఇలాంటి పనుల్లో పనిచేసే కార్మికుల తెగువను ఖచ్చితంగా ప్రోత్సహించాలి. అయితే ఇదే సమయంలో వారెవరూ తలకు క్యాప్ లు ధరించకపోవడంపై విమర్శలు వచ్చాయి. పర్వీన్ కస్వాన్ కూడా ‘కేప్స్ లేని హీరోలు’ అనే క్యాప్షన్ తో ఈ వీడియోను షేర్ చేశారు.

Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు.. కొట్టుకుపోయిన 100 ఏళ్ల నాటి వంతెన
నెటిజన్లు ఈ వీడియోపై స్పందించారు. సరైన భద్రత పాటించకుండా వీరు ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో పనిచేయడం వారి ప్రాణాలకే ప్రమాదకరం అని అభిప్రాయపడ్డారు. తలకు కేప్స్ కూడా ధరించకుండా కార్మికులు విపత్కర పరిస్థితుల్లో పనిచేస్తుంటే అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.