Kishan Reddy: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతల స్వీకరణ.. లక్ష్మణ్, ఈటల, డీకే అరుణ ఏమన్నారంటే?

తెలంగాణ నుంచి బీజేపీకి గత లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు పార్లమెంట్ సీట్లు దక్కాయని ఈటల అన్నారు.

Kishan Reddy: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతల స్వీకరణ.. లక్ష్మణ్, ఈటల, డీకే అరుణ ఏమన్నారంటే?

Kishan Reddy

Kishan Reddy – BJP: బీజేపీ తెలంగాణ (Telangana) అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సభలో పలువురు బీజేపీ నేతలు పాల్గొని మాట్లాడుతూ బీఆర్ఎస్(BRS) పై తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ… తెలంగాణ నుంచి బీజేపీకి గత లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు పార్లమెంట్ సీట్లు దక్కాయని, వచ్చే ఎన్నికల్లో గెలవడానికి మార్గం సుగమం అయిందని అన్నారు. డబ్బు సంచులతో బీఆర్ఎస్ కొన్ని సీట్లు గెలిచిందని చెప్పారు.

ఒక మహిళా కార్పొరేటర్ ఫ్లెక్సీల గొడవను అడ్డుకునేందుకు వెళ్తే ఆమె పై 307 సెక్షన్ కింద కేసు పెట్టారని అన్నారు. భవిష్యత్తు అంతా బీజేపీదే అని చెప్పడం మాత్రమే కాదని, గెలిచి చూపిస్తామని తెలిపారు. తెలంగాణలో కాషాయ జెండా ఎగరాలని మోదీ చెప్పారని అన్నారు. కిషన్ రెడ్డి నాయకత్వంలో అందరం కలిసి పని చేస్తామని చెప్పారు.

డీకే అరుణ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ పిరికి పంద చర్యలకు పాల్పడుతోందని అన్నారు. బీజేపీ నేతలను అరెస్ట్ చేయిస్తున్నారని, కేంద్ర మంత్రి అని చూడకుండా అరెస్ట్ చేశారని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడానికి కలిసి కట్టుగా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ… బీజేపీ కార్యకర్తగా పనిచేసిన వారు నలుగురు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అయ్యారని చెప్పారు. పార్టీ కోసం, సిద్ధాంతం కోసం పని చేసిన చాలా మంది కార్యకర్తలు బీజేపీలో ఉన్నారని తెలిపారు. బండి సంజయ్ సేవలను పార్టీ గుర్తిస్తుందని అన్నారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం ఒకటేనని చెప్పారు. అక్రమాలకు పాల్పడే పార్టీలకు వ్యతిరేకంగా పోరాటం చేయడం కోసం బీజేపీలోకి కిరణ్ కుమార్ రెడ్డి వచ్చారని చెప్పుకొచ్చారు. ఎన్ని కుటుంబ పార్టీలు ఏకం అయినా మోదీని ఏమి చేయలేవని చెప్పారు.

AP Politics: పవన్ కల్యాణ్ మీద పరువు నష్టం నీతిమాలిన చర్య.. సీఎం జగన్‭పై చంద్రబాబు ఫైర్