Independence day 2023 : తెలుగు దేశభక్తి సినిమాల్లో ఈ డైలాగ్స్ విన్నారా..? గూస్‌బంప్స్ రావాల్సిందే..

టాలీవుడ్ లో ఎన్నో దేశభక్తి సినిమాలు వచ్చాయి. వాటిలో దేశంపై ప్రేమను చాటుకుంటూ రచయితలు రాసిన పదునైన డైలాగ్స్ ప్రతి ఒక్కరికి గూస్‌బంప్స్ వచ్చేలా చేస్తాయి. అలాంటి కొన్ని డైలాగ్స్ ఇప్పుడు మీకోసం.

Independence day 2023 : తెలుగు దేశభక్తి సినిమాల్లో ఈ డైలాగ్స్ విన్నారా..? గూస్‌బంప్స్ రావాల్సిందే..

Independence day 2023 telugu movie dialogues on India

Independence day 2023 : ఒక వ్యక్తి మీదైనా, ఒక ప్రదేశం మీదైనా ప్రేమ లేదా భక్తి కలగాలి అంటే.. అందుకు సంబంధించిన కథని వినాలి లేదా చూడాలి. కానీ దేశం మీద ప్రేమ, భక్తి మాత్రం పుట్టకతోనే వచ్చేస్తాయి అనడం లేదు పెద్ద అతిశయోక్తి ఉండదేమో. దేశం అనే విషయానికి వచ్చేపాటికి చిన్న, పెద్ద, మంచి, చెడు మనుషులు ఉండరు. ఎందుకంటే వారిలో ఎన్ని వ్యతిరేక భావాలు ఉన్నా.. దేశం అనే ఒక భావం మాత్రం ప్రతి ఒక్కర్ని ఒకటి చేస్తుంది. ఆ భావానికి కులం, మతంతో కూడా సంబంధం ఉండదు. అంతేకాదు ఆ దేశభక్తి భావం నుంచి తమని ఒకరు వేరు చేస్తూ ఎవరన్నా మాట్లాడినా ఒప్పుకోలేరు.

Independence Day 2023 : తెలంగాణలో మహాత్మా గాంధీ గుడి .. బాపూజీ ఆలయం ఎన్నో సేవలకు నిలయం

ఆ దేశభక్తితోనే ఎంతోమంది ప్రాణాలు అడ్డుపెట్టి భారతమాతని ఆంగ్లేయుల చెర నుంచి విడిపించారు. 1947 ఆగష్టు 15న బ్రిటిష్ నుంచి భారతదేశం స్వాతంత్రం సంపాదించుకుంది. గత ఏడాదితో 75 ఏళ్ళు పూర్తి చేసుకోవడంతో ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ అంటూ ఘనంగా జరుపుకున్నాం. ఇక ఈ ఏడాది 76వ ఇండిపెండెన్స్ డే జరుపుకోబోతున్నాము. ఈ సందర్భంగా దేశభక్తి పై వచ్చిన పలు సినిమాల్లోని డైలాగ్స్ గురించి మాట్లాడుకుందాం. థియేటర్ లో మాస్ డైలాగ్స్ తో ఆడియన్స్ చేత విజుల్స్ వేయించే రైటర్స్ దేశభక్తి విషయంలో తమ కాలానికి మరింత పొందును పెడుతుంటారు.

Independence Day 2023 : భారత్‌తో పాటు ఆగస్టు 15న స్వాతంత్ర్యం దినోత్సవం జరుపుకునే దేశాలు

టాలీవుడ్ లో ఎన్నో దేశభక్తి సినిమాలు వచ్చాయి. వాటిలో దేశంపై ప్రేమను చాటుకుంటూ రచయితలు రాసిన పదునైన డైలాగ్స్ ప్రతి ఒక్కరికి గూస్‌బంప్స్ వచ్చేలా చేస్తాయి. అలాంటి కొన్ని డైలాగ్స్ ఇప్పుడు మీకోసం.

1974లో మన్నేందొరగా ‘అల్లూరి సీతారామరాజు’ సినిమాలో కృష్ణ చెప్పిన డైలాగ్..

1993లో ‘మేజర్ చంద్రకాంత్’లో సీనియర్ ఎన్టీఆర్ దేశం కోసం ప్రాణం ఇవ్వడం గురించి..

2002లో వచ్చిన కృష్ణవంశీ ‘ఖడ్గం’ సినిమాలోని శివాజీ రాజా అండ్ ప్రకాష్ రాజ్ డైలాగ్స్..


2000లో నాగార్జున ‘ఆజాద్’ సినిమాలో ప్రకాష్ రాజ్ డైలాగ్..

1992లో ‘రోజా’ సినిమాలో దేశజెండా పై అరవింద్ స్వామి ప్రేమ..

2005లో వచ్చిన సుభాష్ చంద్రబోస్ సినిమాలో వెంకటేష్ డైలాగ్..