YS Sharmila : వైఎస్ షర్మిల పార్టీ విలీనంపై కాంగ్రెస్ లో భిన్న వాదనలు

పదే పదే ప్రశ్నించినా ఆమె అవునని చెప్పలేదు, అలాగని ఖండించనూ లేదు. ఓపికగా ఎదురు చూడాలని చెప్పారు. దీంతో కాంగ్రెస్ లో వైఎస్సాఆర్ టీపీ విలీన ప్రక్రియ ఖాయమైందని, అతి త్వరలో అధికారిక ప్రకటన రావాల్సివుందన్న వార్తలకు మరింత బలం చేకూరింది. 

YS Sharmila : వైఎస్ షర్మిల పార్టీ విలీనంపై కాంగ్రెస్ లో భిన్న వాదనలు

YS Sharmila (6)

YS Sharmila party merger Congress :తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇతర పార్టీల నుంచి చేరికలు, పార్టీల విలీనాలపై ప్రధాన పార్టీలు ఫోకస్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న (శుక్రవారం) వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వెళ్లి ఢిల్లీ పెద్దలను కలవడంతో వైఎస్సార్ టీపీ కాంగ్రెస్ లో విలీనం చేయడం ఖాయమనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.

కాంగ్రెస్ పెద్దలను కలిసిన షర్మిల ఎంపీ కోమారెడ్డితో కలిసి ఒకే ఫ్లైట్ లో హైదరాబాద్ కు వచ్చారు. షర్మిల ఢిల్లీ టూర్ లో డీల్ కుదిరినట్టు తెలుస్తోంది. దీనిపై షర్మిల ఈరోజు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చిన షర్మిల విలీన ప్రక్రియపై అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు.

Mann Ki Baat : మోదీజీ.. ముస్లింల మన్ కీ బాత్ వినండి.. ప్రధానికి ముస్లిం మత పెద్ద సూచన

పదే పదే ప్రశ్నించినా ఆమె అవునని చెప్పలేదు, అలాగని ఖండించనూ లేదు. ఓపికగా ఎదురు చూడాలని చెప్పారు. దీంతో కాంగ్రెస్ లో వైఎస్సాఆర్ టీపీ విలీన ప్రక్రియ ఖాయమైందని, అతి త్వరలో అధికారిక ప్రకటన రావాల్సివుందన్న వార్తలకు మరింత బలం చేకూరింది.  షర్మిల పార్టీ విలీనంపై కాంగ్రెస్ లో భిన్నవాదనలు తెరమీదికి వస్తున్నాయి.

షర్మిల కాంగ్రెస్ లోకి వచ్చినా ఆంధ్రాలో పని చేయాలని రేవంత్ రెడ్డి అంటున్నారు. మరోవైపు షర్మిలకు తెలంగాణలో ఏం పని ఉందంటూ రేవంత్ రెడ్డి కామెంట్స్ కూడా చేశారు. అయితే రేవంత్ రెడ్డికి భిన్నంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కామెంట్స్ చేశారు. రాజశేఖర్ రెడ్డి బిడ్డగా షర్మిల కాంగ్రెస్ లోకి వస్తే ఆహ్వానిస్తామని చెప్పారు.