Menopause : మెనోపాజ్ దశలో మహిళల్లో వచ్చే ముఖ్యమైన మార్పులు ఇవే ?

మెనోపాజ్ వయస్సు, జన్యుపరంగా నిర్ణయించబడుతుందని నిపుణులు చెబుతారు. అయితే ధూమపానం , కీమోథెరపీ వంటివి అండాశయ క్షీణతకు కారణం అవుతాయి. ఫలితంగా ముందుగానే మెనోపాజ్ వస్తుంది. పెరిమెనోపాజ్ అనేది మెనోపాజ్ ప్రారంభానికి ముందు ఉన్న కాలాన్ని సూచిస్తుంది.

Menopause : మెనోపాజ్ దశలో మహిళల్లో వచ్చే ముఖ్యమైన మార్పులు ఇవే ?

Menopause

Menopause : ఒక నిర్దిష్ట వయస్సు దాటిన స్త్రీలు మెనోపాజ్‌ ను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది సాధారణంగా మీ 40 ఏళ్ల చివరలో లేదా 50 ఏళ్ల ప్రారంభంలో వస్తుంది. రుతువిరతి శరీరంలో అనేక మార్పులకు కారణమవుతుంది. అండాశయాలలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ ఉత్పత్తి తగ్గడం వల్ల శరీరంలో పలు లక్షణాలు చోటు చేసుకుంటాయి. వేడి ఆవిర్లు, బరువు పెరగడం , యోని పొడిగా మారటం వంటి లక్షణాలు ఉంటాయి. అలాగే యోని కణజాలం వాపు ,సన్నబడటం వలన సంభోగ సమయంలో అసౌకర్యం వంటివి నెలకొంటాయి. మెనోపాజ్ బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది.

READ ALSO : Scotland : ఆ స్కూల్లో ఎక్కువమంది కవలలే.. ఈసారి 17 సెట్ల కవలలు జాయిన్ అయ్యారు .. ఎక్కడంటే

మెనోపాజ్ వయస్సు, జన్యుపరంగా నిర్ణయించబడుతుందని నిపుణులు చెబుతారు. అయితే ధూమపానం , కీమోథెరపీ వంటివి అండాశయ క్షీణతకు కారణం అవుతాయి. ఫలితంగా ముందుగానే మెనోపాజ్ వస్తుంది. పెరిమెనోపాజ్ అనేది మెనోపాజ్ ప్రారంభానికి ముందు ఉన్న కాలాన్ని సూచిస్తుంది. పెరిమెనోపాజ్ సమయంలో శరీరం మెనోపాజ్‌లోకి మారడం ప్రారంభిస్తుంది. అంటే అండాశయాల నుండి హార్మోన్ ఉత్పత్తి క్షీణించడం ప్రారంభించిందని అర్థం. సాధారణంగా రుతువిరతితో సంబంధం ఉన్న కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఉదాహరణకు వేడి ఆవిర్లు వంటివి. వరుసగా 12 నెలల పాటు ఋతు చక్రం పూర్తిగా ఆగిపోతే తర్వాత మెనోపాజ్‌లోకి ప్రవేశిస్తారు.

READ ALSO : Madhya Pradesh: ప్రియాంక గాంధీ మీద 41 జిల్లాల్లో పోలీసు కేసులు.. ఇంతకీ ఏం జరిగిందంటే?

మెనోపాజ్ దశకు చేరుకున్నవారు రోజూ వ్యాయామం చేయాలి. రన్నింగ్ లేదా వాకింగ్ వంటివి తప్పకుండా చేస్తుండాలి. డిప్రెషన్, మానసిక ఆందోళన వంటి సమస్యలు దరిచేరకుండా చూసుకునేందుకు ఈ వ్యాయామాలు తోడ్పడతాయి. అప్పుడప్పుడు చిన్న చిన్న బరువులు ఎత్తు తుండాలి. దీని వల్ల కండరాలు, ఎముకలు బలంగా మారుతాయి. మెనోపాజ్ వచ్చిన మహిళల్లో బోలు ఎముకల వ్యాధి వచ్చే అవకాశం ఉన్నందున వ్యాయామాలు దినచర్యలో బాగం చేసుకోవాలి. హార్మోన్లలో అధిక మార్పులు రాకుండా ఉండడానికి ఇవన్నీ తోడ్పడతాయి. రోజువారిగా వ్యాయామాలు చేయటం వల్ల బురువు పెరగకుండా చూసుకోవచ్చు.