Leopard Trapped : తిరుమలలో బోనులో చిక్కిన మరో చిరుత .. 50రోజుల వ్యవధిలో మూడు చిరుతలు..

గత మూడు రోజుల క్రితం ఓ చిరుత బోనులో చిక్కిన విషయం విధితమే. గురువారం తెల్లవారు జామున మరో చిరుత బోనులో చిక్కినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.

Leopard Trapped : తిరుమలలో బోనులో చిక్కిన మరో చిరుత .. 50రోజుల వ్యవధిలో మూడు చిరుతలు..

Leopard Trapped in Cage

Leopard Trapped In Cage: తిరుమల (Tirumala) లో మరో చిరుత పులి (Leopard) బోనులో చిక్కింది. తిరుమల నడకదారిలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయం (Lakshmi Narasimhaswamy Temple) సమీపంలో ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కినట్లు అటవీశాఖ (Forest Department), టీటీడీ (TTD) అధికారులు తెలిపారు. గత మూడు రోజుల క్రితం ఓ చిరుత బోనులో చిక్కిన విషయం విధితమే. తాజాగా మరో చిరుతను అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. ఇటీవల అలిపిరి కాలినడక మార్గంలో చిరుత దాడి చేయడంతో నెల్లూరు జిల్లాకు చెందిన ఆరేళ్ల బాలిక లక్షిత మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. టీటీడీ అధికారులు అప్రమత్తమై  అటవీశాఖ అధికారుల సహాయంతో ఆపరేషన్ చిరుత పేరుతో చిరుతలను బంధించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నేపథ్యంలో చిరుతను బంధించేందుకు అధికారులు తిరుమలకు వెళ్లే కాలినడక మార్గంలో మూడు ప్రాంతాల్లో బోనులు ఏర్పాటు చేశారు.

Leopard: బాబోయ్ మరో చిరుత..! తిరుమల కాలినడక మార్గంలో ఇంకో చిరుతపులి.. ఎలుగుబంటిసైతం ప్రత్యక్షం..

మోకాలిమిట్ట, లక్ష్మీనరసింహస్వామి ఆలయం, 35వ మలుపు వద్ద బోన్లు ఉంచారు. మూడు రోజుల క్రితం బోనులో ఒక చిరుత పులి చిక్కింది. తాజాగా గురువారం తెల్లవారు జామున మరో చిరుత చిక్కినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. మూడు రోజుల వ్యవధిలోనే రెండు చిరుత పులులు బోనులో చిక్కడంతో తిరుమలకు వెళ్లే భక్తులకు కొంత ఊపిరి పీల్చుకున్నారు. 50రోజుల వ్యవధిలోనే మూడు చిరుత పులులను బంధించినట్లు అధికారులు చెప్పారు. ఇదిలాఉంటే లక్షిత ఘటన జరిగిన మరుసటిరోజే నడకదారిలో తిరుమల కొండపైకి వెళ్లే భక్తులకు మరో చిరుత కనిపించడంతో వారు భయాందోళనకు గురయ్యారు. తిరుమల నడకదారి ప్రాంతంలో ఐదు చిరుత పులులు ఉన్నట్లు, అవి చిన్నారిని హతమార్చిన చిరుత పిల్లలు అయ్యి ఉంటాయని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. వీటిని బంధించేందుకు బోనులు ఏర్పాటు చేశారు. దీనికితోడు కాలినడక మార్గంలో తిరుపతి కొండపైకి చేరుకొనే భక్తుల భద్రతకోసం టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది.

TTD Alert : చిరుత దాడి ఘటనతో టీటీడీ అలర్ట్.. తిరుమల నడక మార్గంలో భద్రత కట్టుదిట్టం

తిరుమల నడకదారిలో అడవి జంతువుల దాడులు చోటుచేసుకోకుండా టీటీడీ అధికారులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. టీటీడీ ట్రస్టు బోర్డు పలు నిబంధనలుసైతం అమల్లోకి తెచ్చింది. 12ఏళ్లలోపు వయస్సున్న పిల్లల తల్లిదండ్రులను ఉదయం 5గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు అలిపిరి మెట్ల మార్గం నుంచి అనుమతిస్తామని టీటీడీ తెలిపింది. పెద్దలను రాత్రి 10గంటల వరకు అనుమతిస్తామని తెలిపింది. దీనికితోడు కాలినడకన వెళ్లే భక్తులకు చేతి కర్రలు ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది.

మరోవైపు అడవి జంతువుల కదలికలను గుర్తించేందుకు 500 ట్రాప్ కెమెరాలు నడక మార్గంలో అమర్చేందుకు, అవకాశం ఉన్న చోట డ్రోన్ కెమెరాలు ఉపయోగించే ప్రక్రియను ఆలోచిస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. మరోసారి తిరుమల కాలినడక మార్గంలో భక్తులపై అడవి జంతువుల దాడుల ఘటనలు చోటుచేసుకోకుండా అన్నివిధాల చర్యలు చేపడుతున్నట్లు అధికారులు చెప్పారు.