Thani Oruvan 2 : ధృవ సీక్వెల్ అనౌన్స్‌మెంట్.. ప్రోమో అదిరిపోయింది.. ఈసారి విలన్..

తమిళ్ ధృవ సీక్వెల్ ని అనౌన్స్ చేసిన డైరెక్టర్ మోహన్ రాజా. తెలుగులో రామ్ చరణ్‌తో..

Thani Oruvan 2 : ధృవ సీక్వెల్ అనౌన్స్‌మెంట్.. ప్రోమో అదిరిపోయింది.. ఈసారి విలన్..

Jayam Ravi Mohan Raja Thani Oruvan 2 announced Ram Charan Dhruva

Thani Oruvan 2 : తమిళ్ స్టార్ హీరో జయం రవి (Jayam Ravi), నయనతార (Nayanthara) హీరోహీరోయిన్లుగా, అరవింద్ స్వామి (Arvind Swamy) విలన్ గా నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘తని ఒరువన్’. మోహన్ రాజా ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. 2015 లో వచ్చిన ఈ సినిమా తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. దీంతో ఈ చిత్రాన్ని ‘ధృవ’ (Dhruva) మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) తెలుగు రీమేక్ చేశాడు. సురేంద్ర రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ రీమేక్ కూడా సూపర్ హిట్టుగా నిలిచింది.

Jawan Trailer : జవాన్ ట్రైలర్‌కి డేట్ ఫిక్స్ చేసిన షారుఖ్ ఖాన్.. ఆ రోజునే పవర్‌ఫుల్ కట్..

ఇక ఈ మూవీ సీక్వెల్ పై ఎప్పటి నుంచో చర్చ జరుగుతుంది. తమిళంలో జయం రవితో, తెలుగులో రామ్ చరణ్‌తో ఒకే సమయంలో మోహన్ రాజానే సీక్వెల్ ని తెరకెక్కిస్తాడని వార్తలు కూడా వచ్చాయి. చరణ్ అభిమానుల్లో కూడా ఈ సినిమాకి ఒక ప్రత్యేక స్థానం ఉండడంతో వాళ్ళు కూడా ఈ సీక్వెల్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా మోహన్ రాజా.. తమిళంలో జయం రవితో ‘తని ఒరువన్-2’ని అనౌన్స్ చేశాడు. ఒక వీడియో ప్రోమోని కూడా రిలీజ్ చేశాడు. ఆ ప్రోమోలో హీరో తన నెక్స్ట్ విలన్ కోసం వెయిట్ చేస్తుంటాడు. అయితే ఈ సినిమాలో విలనే హీరోని టార్గెట్ చేసుకొని వస్తాడని దర్శకుడు చెబుతాడు.

NTR 100 Years : రాష్ట్రపతితో ఎన్టీఆర్ కుటుంబం.. తారక్, కళ్యాణ్ రామ్ లేరంటున్న నెటిజెన్స్..

మొదటి పార్ట్ లో “నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే, నీ క్యారెక్టర్ తెలుస్తుంది. నీ శత్రువు ఎవరో తెలిస్తే, నీ సామర్థ్యం తెలుస్తుంది” అని చెప్పిన దర్శకుడు.. ఈ సీక్వెల్ లో “నీలోని నిజాన్ని నాకు చూపించు. నీ శత్రువు ఎవరో నేను చెబుతాను” అని అంటున్నాడు. 2024 నుంచి ఈ మూవీ షూటింగ్ మొదలు కానుందని ప్రోమోతో తెలియజేశాడు. ఇక అనౌన్స్‌మెంట్ చూస్తుంటే.. కేవలం జయం రవితోనే ఈ సినిమా తెరకెక్కబోతుందని తెలుస్తుంది. చరణ్ అభిమానులను ఇది నిరాశ పరిచే వార్తే.