Pawar on Mayawati: మాయావతి న్యూట్రల్ స్టాండ్ ఏంటి? పెద్ద ఆరోపణ చేసిన శరద్ పవార్

ఇండియా మూడవ మీటింగుకు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సమావేశానికి 28 విపక్ష పార్టీల నుంచి 63 మంది ప్రతినిధులు పాల్గొంటారని ఉద్ధవ్ థాకరే పేర్కొన్నారు. ఆగస్టు 31, సెప్టెంబర్ 1న రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి

Pawar on Mayawati: మాయావతి న్యూట్రల్ స్టాండ్ ఏంటి? పెద్ద ఆరోపణ చేసిన శరద్ పవార్

2024 Elections: దేశంలో త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలపై రాజకీయ ఉత్కంఠ నెలకొంది. గురువారం నుంచి ముంబైలో ఇండియా కూటమి నేతల రెండు రోజుల సమావేశం జరగనుంది. దీనికి ఒక రోజు ముందు బుధవారం (ఆగస్టు 30), మహా వికాస్ అగాఢీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ చాలా పెద్ద ఆరోపణ చేశారు. అటు ఎన్డీయేతో కానీ ఇటు ఇండియా కూటమితో కానీ పొత్తు లేదని, తాము ఒంటరిగా ఎన్నికల పోటీకి వెళ్తామని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత మాయావతి ప్రకటించిన కాసేపటికే పవార్ ఈ ఆరోపణ చేయడం గమనార్హం.

2024 Elections: ఇండియా కాదు, ఎన్డీయే కాదు.. లోక్‭సభ ఎన్నికల పోరుపై క్లారిటీ ఇచ్చిన మాయావతి

బీజేపీతో మాయావతి టచ్‌లో ఉన్నారని తనకు తెలుసని శరద్ పవార్ అన్నారు. అంతే కాకుండా మాయావతి తీసుకున్న నిర్ణయంపై ప్రజలు ఆలోచించాలని కోరారు. తాను ప్రతిపక్షంలోనే ఉన్నానని గతంలో చెప్పినట్లు గుర్తు చేసిన ఆయన.. దీనికి సంబంధించి ఎలాంటి గందరగోళం లేదని మరోసారి స్పష్టం చేశారు. దేశంలో ప్రత్యామ్నాయ వేదిక సిద్ధమవుతోందని, దేశంలో మార్పు కోసమే ఈ పొత్తు ఏర్పడిందని పవార్ అన్నారు.

2024 Elections: ఇండియా కూటమి మూడో సమావేశానికి ఒకరోజే ఉంది.. అంతలోనే బాంబు పేల్చిన ఆమ్ ఆద్మీ పార్టీ

కాగా, బుధవారం మాయావతి తన ఎక్స్(ట్విటర్) ఖాతా ద్వారా బుధవారం స్పందిస్తూ ‘‘ఎన్డీయే, ఇండియా కూటములు పేదల వ్యతిరేకివి, కులతత్వ, వర్గ విబేధాలు కలవి, కార్పొరేట్లకు కొంత మంది అనుకూల, పెట్టుబడిదారీ విధానాలతో కూడిన పార్టీలు, వీరి విధానాలకు వ్యతిరేకంగా బీఎస్పీ నిరంతరం పోరాడుతోంది. కాబట్టి వారితో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసే ప్రసక్తే లేదు. అందరూ బీఎస్పీతో పొత్తుకు ఉత్సుకతతో ఉన్నారు. అయితే వారితో కలవలేదని బీజేపీతో కుమ్మక్కయిందని ఆరోపిస్తున్నారు. వారితో జత కడితే సెక్యులర్, కలవకపోతే బీజేపీ బీ-టీం. ఇది చాలా అన్యాయం, ద్రాక్ష దొరికితే మంచిది, లేకపోతే ద్రాక్ష పుల్లన అన్నట్లుంది’’ అని అన్నారు.

Indonesia: పాఠశాలలో మరీ ఇంత వికృత చేష్టలా.. హిజాబ్ సరిగ్గా వేసుకోలేదని 14 మంది బాలికలకు గుండు కొట్టారు

ఇండియా మూడవ మీటింగుకు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సమావేశానికి 28 విపక్ష పార్టీల నుంచి 63 మంది ప్రతినిధులు పాల్గొంటారని ఉద్ధవ్ థాకరే పేర్కొన్నారు. ఆగస్టు 31, సెప్టెంబర్ 1న రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. మొదటి సమావేశం బిహార్ రాజధాని పాట్నాలో జరగ్గా, రెండవ సమావేశంలో కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన విషయం తెలిసిందే.