Jawan Trailer : షారుఖ్ జవాన్ ట్రైలర్ వచ్చేసింది.. యాక్షన్ సీక్వెన్స్‌తో..

షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ మూవీ నుంచి ట్రైలర్ వచ్చేసింది. ఒకసారి దాని వైపు ఒక లుక్ వేసేయండి.

Jawan Trailer : షారుఖ్ జవాన్ ట్రైలర్ వచ్చేసింది.. యాక్షన్ సీక్వెన్స్‌తో..

Shah Rukh Khan Nayanathara Vijay Sethupathi Jawan Trailer released

Jawan Trailer : తమిళ్ దర్శకుడు అట్లీ, బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ (Shah Rukh Khan) కాంబినేషన్ లో వస్తున్న సినిమా ‘జవాన్’. నయనతార (Nayanathara) ఈ సినిమాలో హీరోయిన్ గా, విజయ్ సేతుపతి విలన్ గా కనిపించబోతున్నారు. ఇక ప్రియమణి, సన్య, యోగిబాబు ముఖ్యపాత్రల్లో నటిస్తుంటే దీపికా పదుకొనే అతిధి పాత్రలో మెరవబోతుంది. రిలీజ్ దగ్గర పడడడంతో ప్రమోషన్స్ లో భాగంగా మూవీలోని సాంగ్స్ ని ఒక్కొక్కటిగా రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. అలాగే ప్రివ్యూ అంటూ ఇప్పటికే ఒక ట్రైలర్ కట్ ని రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా మరో ట్రైలర్ ని రిలీజ్ చేశారు.

MAD Movie Teaser : ఇంజనీరింగ్ పోరలు రచ్చ.. ‘మ్యాడ్’ మూవీ టీజర్ చూసి మ్యాడ్ అవ్వాల్సిందే..

ఈ సినిమాలో షారుఖ్ డ్యూయల్ రోల్ లో నటించబోతున్నాడు. తండ్రి కొడుకులుగా కనిపిస్తూనే.. జవాన్, ఖైదీగా, నెగటివ్ రోల్ లో డిఫరెంట్ షేడ్స్ లో కనిపించబోతున్నాడు. ట్రైలర్ లోని విజవల్స్ చూస్తుంటే చాలా రిచ్ గా కనిపించాయి. దేశం కోసం ప్రాణమిచ్చే జవాన్.. ఒక విలన్ వల్ల తన కుటుంబం, ప్రజలను పోగుట్టుకొని రివెంజ్ కోసం చేసే పోరాటమే సినిమా కథ అని ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతుంది. మరి ఈ కథని అట్లీ తన స్టైలిష్ టేకింగ్ తో ఎలా డీల్ చేసాడో తెలియాలి అంటే మూవీ చూడాల్సిందే.

Drugs Case : మాదాపూర్ డ్రగ్స్ పార్టీ పై విచారణ వేగవంతం చేసిన పోలీసులు..

ఈ సినిమాని షారుఖ్ తన సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో తమిళ్ స్టార్ హీరో విజయ్ (Vijay) కూడా అతిధి పాత్రలో కనిపించబోతున్నాడని సమాచారం. అయితే మూవీ టీం నుంచి మాత్రం ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. సెప్టెంబర్ 7న హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.