Spirit of cricket : మ్యాచ్‌లో దీన్ని గమనించారా..! హార్దిక్ షూ లేస్ కట్టిన పాక్ క్రికెటర్.. ఎవరో తెలుసా..?
ఆసియాకప్ (Asia Cup) 2023లో భాగంగా శనివారం భారత్, పాకిస్తాన్ జట్లు తలపడ్డాయి. భారత ఇన్నింగ్స్ ముగిసిన తరువాత మొదలైన వర్షం ఎంతకూ తగ్గకపోవడంతో మ్యాచ్‌ను అంపైర్లు రద్దు చేశారు.
Spirit of cricket : ఆసియాకప్ (Asia Cup) 2023లో భాగంగా శనివారం భారత్, పాకిస్తాన్ జట్లు తలపడ్డాయి. భారత ఇన్నింగ్స్ ముగిసిన తరువాత మొదలైన వర్షం ఎంతకూ తగ్గకపోవడంతో మ్యాచ్‌ను అంపైర్లు రద్దు చేశారు. మ్యాచ్ మొత్తం జరిగి ఉంటే బాగుండేదని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. భారత ఇన్నింగ్స్ సందర్భంగా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య షూ లేస్ ఊడిపోగా పాక్ క్రికెటర్ షాబాద్ కట్టాడు.
Heath Streak : బతికే ఉన్నానన్న 10 రోజులకే.. జింబాబ్వే దిగ్గజ క్రికెటర్ హీత్ స్ట్రీక్ కన్నుమూత..
ఇందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిజమైన క్రీడా స్పూర్తి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ పిక్ అందరి హృదయాలను గెలుచుకుంది.
మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు రోహిత్ శర్మ(11), శుభ్‌మన్ గిల్(10), విరాట్ కోహ్లి(4), శ్రేయస్ అయ్యర్ (14) లు విఫలం కావడంతో టీమ్ఇండియా 66 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ (82; 81 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు), ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య (87; 90 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) జట్టును ఆదుకున్నారు. చివరకు 48.5 ఓవర్లలో భారత్ 266 పరుగులకు ఆలౌటైంది. పాకిస్తాన్ బౌలర్లలో షహీన్ అప్రీది నాలుగు వికెట్లు తీయగా, నదీమ్ షా, హారిస్ రవూఫ్ లు చెరో మూడు వికెట్లు తీశారు.
Mahika Gaur : ధోనిని ఆరాధించే క్రికెటర్.. చరిత్ర సృష్టించింది
భారత ఇన్నింగ్స్ ముగిసిన తరువాత వర్షం ప్రారంభమైంది. ఎంతసేపటికి వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్‌ను అంపైర్లు రద్దు చేశారు. ఇరు జట్లకు చెరో పాయింట్‌ను కేటాయించారు.
Pakistani cricketer Shadab Khan ties Indian batter Hardik Pandya’s shoelaces, exemplifying the true spirit of sportsmanship.
This heartwarming moment is sure to make your day and is truly the best thing on the internet today.
#PAKvIND #PakVsIndia #ShadabKhan #AsiaCup2023 pic.twitter.com/fb7cR8aunj— Anokhay (@AnokhayOfficial) September 2, 2023