Udhayanidhi Stalin: ఉదయనిధి స్టాలిన్‌కు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్‌లో నిరసనలు

ఉదయనిధి స్టాలిన్‌ను పందితో పోల్చుతూ తిరుపతిలో పలు చిత్రాలను విడుదల చేసింది సనాతన ధర్మ పరిరక్షణ సమితి.

Udhayanidhi Stalin: ఉదయనిధి స్టాలిన్‌కు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్‌లో నిరసనలు

Udhayanidhi Stalin

Andhra Pradesh – Udhayanidhi Stalin: సనాతన ధర్మంపై తమిళనాడు (Tamil Nadu) ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ వ్యాఖ్యలను ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్‌లో హిందూ సంఘాలు నిరసనలు తెలిపాయి. సనాతన ధర్మం మలేరియా, డెంగీ వ్యాధుల లాంటిదని దాన్ని నిర్మూలించాలని ఉదయనిధి స్టాలిన్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.

దీంతో స్టాలిన్‌ను పందితో పోల్చుతూ తిరుపతిలో పలు చిత్రాలను విడుదల చేసింది సనాతన ధర్మ పరిరక్షణ సమితి. స్టాలిన్‌పై చర్యలు తీసుకోవాలని తిరుపతి ఎస్వీయూ క్యాంపస్‌లోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఉదయనిధి స్టాలిన్‌ను తీవ్రవాదిగా గుర్తించి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది. ఉదయనిధి స్టాలిన్ చిత్రపటాన్ని కాల్చి నిరసన తెలిపింది.

స్టాలిన్ పై చర్యలు తీసుకోవాలి:  సాధినేని యామినీ శర్మ
మరోవైపు, బీజేపీ నాయకురాలు సాధినేని యామినీ శర్మ మాట్లాడుతూ… సనాతన ధర్మాన్ని అవమానించేలా వ్యాఖ్యలు చేసిన ఉదయనిధి స్టాలిన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించాలని సుప్రీంకోర్టును కోరారు.

సనాతన ధర్మాన్ని ఎవరూ అంతం చేయలేరు
ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై అఖిల కర్ణాటక బ్రాహ్మిన్ మహాసభ సభ్యుడు రాఘరేంద్ర భట్ ఇవాళ బెంగళూరులో మాట్లాడుతూ… సనాతన ధర్మాన్ని ఎవరూ అంతం చేయలేరని అన్నారు. ప్రజల సంతోషం, శ్రేయస్సే సనాతన ధర్మ విజన్ అని చెప్పారు.

ఒకవేళ అది అంతమైతే సృష్టి కూడా అంతమవుతుందని చెప్పుకొచ్చారు. అనేక మతాలు అంతమవుతున్నాయని, సనాతన ధర్మానికి మాత్రం అంతం అనేదే ఉండదని చెప్పారు. దేశ ప్రజలకు ఉదయనిధి స్టాలిన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

హిందువులంతా శపించాలి: స్వరూపానందేంద్ర 
ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై శారదా పీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనారిటీల ఓట్ల కోసం సనాతన ధర్మాన్ని కించపరచడం నీచమైన చర్య అని అన్నారు. ధర్మాన్ని విమర్శిస్తే తల్లిని దూషించినట్లేనని చెప్పారు. ఉదయనిధికి స్టాలిన్ కి రాజకీయ జీవితం లేకుండా సమస్త హిందువులంతా శపించాలని అన్నారు. ఉదయనిధికి స్టాలిన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

Roja Selvamani : చంద్రబాబు, లోకేశ్‎పై సీబీఐ విచారణ జరిపి జైలుకి పంపాలి- మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు