Telangana Govt : భారీ వర్షాలతో నాలుగు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు

తెలంగాణలో 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. అల్పపీడనం వల్ల మరో వారం పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉంది.

Telangana Govt : భారీ వర్షాలతో నాలుగు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు

holiday for educational institutions

Telangana Govt – Holiday Educational Institutions :  తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో కుండపోత వానలు పడుతున్నాయి. భారీ వర్షాలతో పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ఇచ్చింది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నాలుగు జిల్లాల్లో సెలవు ప్రకటించింది.

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ఇచ్చారు.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరం వెంబడి కేంద్రీకృతమైంది. అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Telangana Rains : తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. 7 జిల్లాలకు రెడ్, 11 జిల్లాలకు ఆరెంజ్, 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్

తెలంగాణలో 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. అల్పపీడనం వల్ల మరో వారం పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉంది. హైదరాబాద్ జంట జాలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.

హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ కు వరద పోటెత్తింది. హిమాయత్ సాగర్ 2 గేట్లు ఎత్తివేసి 1373 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఉస్మాన్ సాగర్ 2 గేట్లు ఎత్తివేసి 442 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.