COVID-19 : ఢిల్లీలో ప్రబలుతున్న కొవిడ్ పిరోలా వేరియంట్.. పెరిగిన వైరల్ ఫీవర్ కేసులు

ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్ లో కొవిడ్-19 పిరోలా వేరియంట్ ప్రబలుతోంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూకేలతో సహా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో బీఏ 2.86 పిరోలా కొవిడ్ వేరియంట్ ప్రబలుతోంది. ఢిల్లీ, ఎన్‌సిఆర్‌లో గత నెలలో వైరల్ ఫీవర్ కేసులు పెరిగాయి....

COVID-19 : ఢిల్లీలో ప్రబలుతున్న కొవిడ్ పిరోలా వేరియంట్.. పెరిగిన వైరల్ ఫీవర్ కేసులు

COVID-19 Pirola Variant

COVID-19 Pirola Variant : ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్ లో కొవిడ్-19 పిరోలా వేరియంట్ ప్రబలుతోంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూకేలతో సహా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో బీఏ 2.86 పిరోలా కొవిడ్ వేరియంట్ ప్రబలుతోంది. ఢిల్లీ, ఎన్‌సిఆర్‌లో గత నెలలో వైరల్ ఫీవర్ కేసులు పెరిగాయి. (Threat Of COVID-19) 50శాతం కుటుంబాల్లో కొవిడ్, ఫ్లూ,వైరల్ ఫీవర్ లక్షణాలతో ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యులు బాధపడుతున్నట్లు లోకల్ సర్కిల్స్ సర్వేలో తేలింది. (Pirola Variant Looming Over Delhi NCR)

Libya floods : లిబియా వరదల్లో 2వేల మంది మృతి, వేలాదిమంది గల్లంతు

చాలా మంది వ్యక్తులు కొవిడ్ ప్రోటోకాల్‌ను గమనించడం లేదు. ఇంట్లో కూడా తమను తాము పరీక్షించుకోవడం మానేశారు. దీంతో కొత్త కొవిడ్ వేరియంట్ వ్యాప్తి చెందే ప్రమాదాన్ని పెంచుతుందని సర్వే వెల్లడించింది. ఒమైక్రాన్ కు భిన్నంగా ఆల్ఫా, డెల్టా వేరియంట్ లకు దగ్గరి లక్షణాలున్న పిరోలా వేరియంట్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయి. పిరోలా వేరియంట్ కొవిడ్ సోకిన రోగులు రుచి, వాసన కూడా కోల్పోతారు.

Kim Jong Un : పుతిన్‌ను కలిసేందుకు రష్యాకు రైలులో బయలుదేరిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్

జ్వరం, ముక్కు కారటం, గొంతునొప్పి, తలనొప్పి, కీళ్లనొప్పులు, శరీర నొప్పి, శ్వాసకోశ సమస్యలు, వైరల్ ఫీవర్ లక్షణాలున్న రోగులు ఢిల్లీ, గురుగ్రామ్, ఫరీదాబాద్, నోయిడా, ఘజియాబాద్ ప్రాంతాల్లో 61 శాతం మంది ఉన్నారని సర్వేలో వెల్లడైంది. జ్వరాలు సోకిన వారిలో 2 నుంచి 3శాతం మంది కొవిడ్ లక్షణాలతో బాధపడుతున్నారు.

Nipah virus : కేరళలో నిపా వైరస్ మహమ్మారి…ఇద్దరి మృతి

వైరల్ ఫీవర్స్, కొవిడ్, స్వైన్ ఫ్లూ వంటి జ్వరాలతో రోగులు అల్లాడుతున్నారు. ఢిల్లీలో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్టీపీసీఆర్ పరీక్షలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఢిల్లీ ప్రాంతంలో పిరోలా కొవిడ్ వేరియంట్ కేసులు ప్రబలుతుండటంతో మాస్కులు ధరించాలని వైద్యాధికారులు సూచించారు.