INDIA bloc: ఇండియా కూటమిని వదలని ప్రధాని వివాదం.. మరోసారి నితీశ్ పేరు లేవనెత్తిన జేడీయూ

దేశంలో కనుక ప్రధాని అభ్యర్థిపై సర్వే చేస్తే నితీశ్ కుమార్‌ను ప్రధానిగా చూడాలని చాలా మంది కోరుకుంటున్నట్లు వెల్లడి అవుతుందని అశోక్ చౌదరి అంటున్నారు. బీహార్ మాత్రమే కాకుండా, బయటి నుంచి పెద్ద ఎత్తున మద్దతు వస్తుందని ఆయన అన్నారు

INDIA bloc: ఇండియా కూటమిని వదలని ప్రధాని వివాదం.. మరోసారి నితీశ్ పేరు లేవనెత్తిన జేడీయూ

2024 Elections: భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా దేశంలోని పలు విపక్షాలు కలిసి ఇండియా అనే పేరుతో కూటమిగా ఏర్పడ్డాయి కానీ, ఈ కూటమిలో అనేక లుకలుకలు కనిపిస్తున్నాయి. అతి ముఖ్యంగా కూటమి నుంచి ప్రధాని అభ్యర్థిపై వివాదం తొలగడం లేదు. అంతలోనే వివిధ పార్టీల నుంచి ప్రధాని అభ్యర్థుల పేర్లు తరుచూ వినిపిస్తున్నాయి. ఇందులో బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పేరు ప్రధానం చెప్పుకోవచ్చు. కూటమి ప్రయత్నాలు ప్రారంభించనప్పటి నుంచే ఆయన పేరు ప్రధానిగా తెరపైకి వచ్చింది. ఆయన డిప్యూటీ తేజశ్వీ యాదవే పలుమార్లు బహిరంగంగా ఈ విషయాన్ని ప్రస్తావించారు.

Jaahnavi Kandula: జాహ్నవి కందుల మృతిపై అమెరికా పోలీసుల వ్యంగ్యం.. సీరియస్ గా స్పందించిన భారత్

అయితే కూటమి సమావేశాల్లో దీనిపై పెద్దగా ప్రస్తావించవద్దని నేతలు నిర్ణయం తీసుకున్నప్పటికీ అదును చూసి మళ్లీ మళ్లీ ప్రస్తావిస్తున్నారు. ఇక నితీశ్ కుమార్ ప్రధాని అభ్యర్థంటూ తాజాగా జేడీయూ మరోసారి ప్రస్తావించింది. ఆయనకు క్లీన్ ఇమేజ్ ఉందని, ఆయన అయితేనే ప్రధానమంత్రి అభ్యర్థిత్వానికి సరిపోతారని పేర్కొంది. జేడీయూ నేత, బిహార్ మంత్రి అశోక్ చౌదరి అన్నారు. దీనికి ముందు జేడీయూ జాతీయ అధ్యక్షుడు లాలన్ సింగ్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఆ వెంటనే అశోక్ చౌదరి వ్యాఖ్యానించడం గమనార్హం. ఏ పార్టీ కార్యకర్త అయినా తమ నేతను ఉన్నత పదవిలో చూడాలని కోరుకుంటుందని, అందుకే తమ నాయకుడిని ప్రధానిగా చూడాలనుకుంటున్నట్లు అశోక్ చౌదరి తెలిపారు.

Kishan Reddy : మాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేసే విధానం ఇది కాదు.. చంద్రబాబు అరెస్ట్ పై స్పందించిన కిషన్ రెడ్డి

దేశంలో కనుక ప్రధాని అభ్యర్థిపై సర్వే చేస్తే నితీశ్ కుమార్‌ను ప్రధానిగా చూడాలని చాలా మంది కోరుకుంటున్నట్లు వెల్లడి అవుతుందని అశోక్ చౌదరి అంటున్నారు. బీహార్ మాత్రమే కాకుండా, బయటి నుంచి పెద్ద ఎత్తున మద్దతు వస్తుందని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలలో నితీశ్ పనిచేశారు. పైగా ఆయన 17 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పటి వరకు ఆయన మీద ఎలాంటి రీమార్క్ లేదని అధోక్ చౌదరి అంటున్నారు. అయితే ఇండియా కూటమి మూడవ సమావేశానికి ముందు నితీశ్ ఒక ప్రకటన చేశారు. తనకు ఎలాంటి కోరిక లేదని చెప్పారు. ప్రతిపక్షాలను ఒకే వేదికపైకి తీసుకురావాలని తన కోరికని, అదే పని చేస్తున్నట్లు నితీశ్ వెల్లడించారు.