Navdeep : డ్రగ్స్ కేసులో నవదీప్..! తాను కాదంటున్న టాలీవుడ్ హీరో నవదీప్

మాదాపూర్ డ్రగ్స్ కేసులో నార్కోటిక్ విభాగం డ్రగ్స్ స్వాధీనం చేసుకుంది. ఐదుగురిని అరెస్ట్ చేశాం. Navdeep - Madhapur Drugs Case

Navdeep : డ్రగ్స్ కేసులో నవదీప్..! తాను కాదంటున్న టాలీవుడ్ హీరో నవదీప్

Navdeep - Drugs Case

Navdeep – Madhapur Drugs Case : టాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. డ్రగ్స్ కేసులో మరోసారి టాలీవుడ్ హీరో నవదీప్ పేరు తెరపైకి వచ్చింది. హైదరాబాద్ మాదాపూర్ డ్రగ్స్ కేసుకి సంబంధించి హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సంచలన, షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఈ కేసులో టాలీవుడ్ లో ఉన్న వారు సైతం బయటకు వస్తున్నారని ఆయన చెప్పారు. ఈ కేసులో టాలీవుడ్ హీరో నవదీప్ కూడా ఉన్నట్లు తెలిపారాయన. నవదీప్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. మాదాపూర్‌ డ్రగ్స్ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేయడంతో పాటు డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నామని, నిందితుల ఫోన్లను సీజ్‌ చేశామని సీపీ సీవీ ఆనంద్ వివరించారు.

”మాదాపూర్ డ్రగ్స్ కేసులో నార్కోటిక్ విభాగం డ్రగ్స్ స్వాధీనం చేసుకుంది. ఐదుగురిని అరెస్ట్ చేశాం. మొత్తం డ్రగ్స్ బెంగుళూరు నుంచి వచ్చిందని తెలిసింది. ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకుని డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. వీసా గడవు ముగిసినా దేశంలో ఉన్నారు. డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న వారిలో వరంగల్ కు చెందిన వ్యక్తి ఉన్నాడని గుర్తించాము. సోషల్ మీడియా ద్వారా డ్రగ్స్ విక్రయాలు జరుపుతున్నారు.

Also Read..Baby Movie : బేబీ సినిమాపై సీపీ తీవ్ర ఆగ్రహం.. సీరియస్ వార్నింగ్ ఇచ్చిన సీవీ ఆనంద్, ఇక ప్రతి సినిమాపైనా నిఘా

ఈ కేసులో మాజీ ఎంపీ కూమారుడు దేవరకొండ సురేశ్ రావుని అరెస్ట్ చేశాము. బెంగుళూరులో 18 మంది నైజీరియన్లు ఉన్నట్లు గుర్తించాము. ఈ కేసులో హీరో నవదీప్ కన్జ్యూమర్ గా ఉన్నారు. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నారు” అని సీపీ సీవీ ఆనంద్ చెప్పారు. ఈ కేసులో నవదీప్ స్నేహితుడు రాంచంద్ ను అరెస్ట్ చేశామని, అతడు ఇచ్చిన సమాచారం ప్రకారం కన్జ్యూమర్ గా నవదీప్ ఉన్నట్టు గుర్తించామని సీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు.

మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ ఉన్నట్లు సీపీ చెప్పడం.. సినీ పరిశ్రమలో కలకలం రేపింది. ఒక్కసారిగా ఇండస్ట్రీ వర్గాలు ఉలిక్కిపడ్డాయి. డ్రగ్స్ కేసులో తన పేరు రావడంపై నవదీప్ ట్విట్టర్ లో స్పందించారు. పోలీసులు చెబుతున్న నవదీప్ తాను కాదన్నారు. డ్రగ్స్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. నేను ఎక్కడికీ పారిపోలేదు, ఇక్కడే ఉన్నాను అన్న నవదీప్.. దీనిపై క్లారిటీ ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ట్వీట్ చేశారు నవదీప్.

Also Read..Dancer Suspicious Death : తమిళనాడులో తిరుపతికి చెందిన మహిళా డ్యాన్సర్ అనుమానాస్పద మృతి

ఇటీవల వెలుగుచూసిన మాదాపూర్ డ్రగ్స్ కేసు తీవ్ర సంచలనం సృష్టించింది. దీన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు దర్యాఫ్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో మరికొందరిని అరెస్ట్ చేశారు. వీరిలో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఉన్నట్లు సీపీ సీవీ ఆనంద్ చెప్పడం కలకలం రేపింది. గతంలో ఓ డ్రగ్స్ కేసుకి సంబంధించి హీరో నవదీప్ పోలీసులు ముందు హాజరయ్యాడు. తాజాగా మాదాపూర్ డ్రగ్స్ కేసులోనూ నవదీప్ కన్జ్యూమర్ గా ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఓ వ్యక్తి వద్ద నుంచి నవదీప్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్లుగా తమ దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. మాదాపూర్ డ్రగ్స్ కేసుకి సంబంధించిన వివరాలను వెల్లడించిన సీపీ సీవీ ఆనంద్.. సంచలన విషయాలు బయటపెట్టారు.

బెంగళూరు కేంద్రంగా హైదరాబాద్ కి డ్రగ్స్ సప్లయ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మొత్తం 8మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. వారిలో హీరో నవదీప్ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం నవదీప్ పరారీలో ఉన్నారని, ఆయన ఫోన్ కూడా స్విచ్చాఫ్ వస్తోందని పోలీసులు వెల్లడించారు. నవదీప్ తో మరో ఇద్దరు తమ ఫోన్లు స్విచ్చాఫ్ చేసుకుని పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్పారు. వీరితో పాటు మరో 18మంది నైజీరియన్లు ఈ కేసులో కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు చెప్పారు. బెంగళూరు నుంచి డ్రగ్స్ ను హైదరాబాద్ తీసుకొచ్చి వీకెండ్స్ లో పార్టీలు చేస్తున్నారు. గచ్చిబౌలిలోని ఓ పబ్ కు, హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్ లోని మరో పబ్ కు డ్రగ్స్ సప్లయ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.ఈ కేసులో నవదీప్ ను పోలీసులు విచారించాల్సి ఉంది. అయితే నవదీప్ అందుబాటులో లేడని పోలీసులు చెప్పారు.