Chandrababu CID custody : చంద్రబాబును రెండు రోజులు సీఐడీ కస్టడీకి ఇస్తూ తీర్పు.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో విచారించేందుకు అనుమతించిన ఏసీబీ కోర్టు

చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై ఏసీబీ కోర్టులో గురువారమే వాదనలు ముగిశాయి. చంద్రబాబును ఐదు రోజులపాటు కస్టడీకి సీఐడీ అధికారులు కోరారు. చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో విచారిస్తే మరిన్ని కీలక అంశాలు వెలుగులోకి వస్తాయంటూ సీఐడీ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు.

Chandrababu CID custody : చంద్రబాబును రెండు రోజులు సీఐడీ కస్టడీకి ఇస్తూ తీర్పు.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో విచారించేందుకు అనుమతించిన ఏసీబీ కోర్టు

Chandrababu CID custody

Chandrababu CID custody ACB court : టీడీపీ అధినేత చంద్రబాబును రెండు రోజుల కస్టడీకి అనుమతిస్తూ ఏసీబీ కోర్టు తీర్పు వెల్లడించింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో విచారించేందుకు ఏసీబీ కోర్టు అనుమతించింది. విచారణ సమయంలో ఎలాంటి ఫొటోలు, వీడియోలు బయటకు వెల్లడించకూడదని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారే చేశారు. చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై ఏసీబీ కోర్టులో గురువారమే వాదనలు ముగిశాయి.

చంద్రబాబును ఐదు రోజులపాటు కస్టడీకి సీఐడీ అధికారులు కోరారు.చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో విచారిస్తే మరిన్ని కీలక అంశాలు వెలుగులోకి వస్తాయంటూ సీఐడీ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబుకు ఎవరెవరు సహకరించారు..? ఈ స్కామ్ లో ఇంకా ఎవరెవరు ఉన్నారు? అనేది వెలుగులోకి వస్తాయని సీఐడీ తరుపు న్యాయవాదులు ఏసీబీ కోర్టుకు విన్నవించారు.

Chandrababu Quash Petition: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు

సీఐడీ తరపు న్యాయవాది వాదనలతో ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఏకీభవించారు. చంద్రబాబును సీఐడీ కస్టడీకి ఇస్తూ న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు. చంద్రబాబును రెండు రోజుల కస్టడీకి ఇస్తూ తీర్పు ఇచ్చారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో విచారించేందుకు అనుమతించారు. విచారణ సమయంలో ఎలాంటి ఫొటోలు, వీడియోలు బయటకు వెల్లడించకూడదని ఆదేశాలు జారే చేశారు.

చంద్రబాబును ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించేందుకు న్యాయమూర్తి అనుమతి ఇచ్చారు. న్యాయవాదుల సమక్షంలో విచారణ జరగాలని సూచించారు. విచారణకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించకూడదని ఆదేశించారు.

Chandrababu Remand: చంద్రబాబుకు మరో రెండు రోజులు రిమాండ్ పొడిగింపు.. జడ్జితో బాబు ఏమన్నారంటే

చంద్రబాబు ఆరోగ్య రిత్యా, వయసు రిత్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కస్టడీ ముగిసిన అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ఎదుట హాజరు పరచాలని ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబు కస్టడీ విచారణ అంశాలను కోర్టు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుందని తెలిపారు.