Shubman Gill : శుభ్‌మ‌న్ గిల్ అరుదైన ఘ‌న‌త‌.. ధావ‌న్‌, రాహుల్‌, కోహ్లీ రికార్డు బ‌ద్ద‌లు

భార‌త ఓపెన‌ర్ శుభ్‌మ‌న్ గిల్ (Shubman Gill) చ‌రిత్ర సృష్టించాడు. టీమ్ఇండియా (Team India) త‌రుపున‌ వ‌న్డేల్లో అత్యంత వేగంగా ఆరు శ‌త‌కాలు సాధించిన మొద‌టి బ్యాట్స్‌మెన్‌గా రికార్డుల‌కు ఎక్కాడు.

Shubman Gill : శుభ్‌మ‌న్ గిల్ అరుదైన ఘ‌న‌త‌.. ధావ‌న్‌, రాహుల్‌, కోహ్లీ రికార్డు బ‌ద్ద‌లు

Shubman Gill 6 ODI century

Shubman Gill 6 ODI century : భార‌త ఓపెన‌ర్ శుభ్‌మ‌న్ గిల్ (Shubman Gill) చ‌రిత్ర సృష్టించాడు. టీమ్ఇండియా (Team India) త‌రుపున‌ వ‌న్డేల్లో అత్యంత వేగంగా ఆరు శ‌త‌కాలు సాధించిన మొద‌టి బ్యాట్స్‌మెన్‌గా రికార్డుల‌కు ఎక్కాడు. ఇండోర్‌లో ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న రెండో వ‌న్డేలో గిల్ ఈ అరుదైన ఘ‌న‌త‌ను సాధించాడు. ఈ మ్యాచులో గిల్ 97 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స‌ర్లు సాయంతో 104 ప‌రుగులు చేశాడు. అత‌డు 92 బంతుల్లోనే శ‌త‌కాన్ని అందుకున్నాడు.

శిఖ‌ర్ ధావ‌న్ రికార్డు బ్రేక్‌..

ఇంత‌క‌ముందు వ‌ర‌కు భార‌త్ త‌రుపున వ‌న్డేల్లో అత్యంత వేగంగా ఆరు శ‌త‌కాలు సాధించిన ఆట‌గాడిగా శిఖ‌ర్ ధావ‌న్ ఉన్నాడు. ధావ‌న్ 46 వ‌న్డే ఇన్నింగ్స్‌ల్లో ఆరు శ‌త‌కాలు బాద‌గా తాజాగా గిల్ 35 ఇన్నింగ్స్‌ల్లో ఆ రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు. వీరిద్ద‌రి త‌రువాత ఈ జాబితాలో కేఎల్ రాహుల్‌, విరాట్ కోహ్లీ, గౌత‌మ్ గంభీర్‌లు ఉన్నారు.

భార‌త్ త‌రుపున వ‌న్డేల్లో వేగంగా ఆరు సెంచ‌రీలు చేసిన ఆట‌గాళ్ల జాబితా..

శుభమన్ గిల్ – 35 ఇన్నింగ్స్‌ల్లో
శిఖర్ ధావన్ – 46 ఇన్నింగ్స్‌ల్లో
కేఎల్‌ రాహుల్ – 53 ఇన్నింగ్స్‌ల్లో
విరాట్ కోహ్లీ – 61 ఇన్నింగ్స్‌ల్లో
గౌతమ్ గంభీర్ – 68 ఇన్నింగ్స్‌ల్లో

Asian Games 2023: పతకం ఖాయమైంది.. బంగ్లాదేశ్‌ను ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్ జట్టు