Kharif Kandi Cultivation : ఖరీప్ కందిలో పురుగుల ఉధృతి.. నివారిస్తేనే అధిక దిగుబడులంటున్న శాస్త్రవేత్తలు

ప్ర‌స్తుతం ఖ‌రీఫ్ సీజ‌న్ లో వేసిన కంది  పూత‌, కాత ద‌శ‌లో ఉంది. అయితే ఈ ద‌శ చాలా కీల‌క‌మైంది . ఈ స‌మ‌యంలో కందికి ప్రధాన శ‌త్రువులైన శ‌న‌గ‌ప‌చ్చ పురుగు, మారుక మ‌చ్చ‌ల పురుగుల తాకిడి అధికంగా కనిపిస్తోంది.

Kharif Kandi Cultivation : ఖరీప్ కందిలో పురుగుల ఉధృతి.. నివారిస్తేనే అధిక దిగుబడులంటున్న శాస్త్రవేత్తలు

Kharif Kandi Cultivation

Kharif Kandi Cultivation : యాసంగి పంటలు వేసే రైతాంగం బోర్లు, బావుల కింద  ఆరుత‌డి పంట‌లుగా కంది, ఆముదం వంటి పంట‌ల‌ను సాగుచేయ‌డం మంచిదని శాస్త్ర‌వేత్త‌లు సూచిస్తున్నారు. విత్తనాల ఎంపిక, ఎరువుల యాజమాన్యంలో కొద్దిపాటి మెళకువలు పాటిస్తే గణనీయంగా లాభాలు గడించవచ్చంటున్నారు . ప్ర‌స్తుతం ఖ‌రీఫ్‌లో వేసిన కంది పూత‌, కాత ద‌శ‌లో ఉంది. చాలా ప్రాంతాల్లో చీడ‌పీడ‌ల బెడద అధికంగా కనిపిస్తోంది. వీటి నివార‌ణ‌ చర్యల గురించి శాస్త్ర‌వేత్త‌ల స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇప్పుడు తెలుసుకుందాం.

READ ALSO : Cotton Crop : పత్తిచేలలో వర్షపు నీరు.. చీడపీడలు సోకే అవకాశం

ర‌బీలో వ‌రికి ప్ర‌త్యామ్నాయంగా ఆరుత‌డి పంట‌లు  సాగుచేయ‌టం మంచిద‌ని శాస్త్ర‌వేత్త‌లు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆముదం, కంది పంట‌లు సాగుకు అనుకూల ప‌రిస్థితులు ఉన్నాయి. ఒక ఎక‌రం వ‌రిసాగుకు స‌రిప‌డే నీటితో 4 ఎక‌రాల్లో ఆరుత‌డి పంట‌లు పండించుకోవ‌చ్చు.

ముఖ్యంగా  పప్పు దినుసుల పంటల్లో కందిపంట ప్రధానమైనది.  ఈ సాగు వ‌ల్ల రైతు ఆర్ధిక ప‌రిపుష్టి సాధించే అవ‌కాశ‌ముంది. ర‌బీలో ఎదుర‌య్యే బెట్ట‌ప‌రిస్థితుల‌ను అధిగ‌మించేందుకు ప్ర‌తి రైతు త‌మ పొలాల్లో ఫాంపాండ్స్ తీయ‌డం వ‌ల్ల భూగ‌ర్భ జ‌లాలు పెరిగి బోర్లు రీచ్చార్జ్ కావ‌డంతో పాటు పంట‌కు నీటితేమ ల‌భ్య‌త సుధీర్ఘకాలం ల‌భించే అవ‌కాశం ఉంటుంది.

READ ALSO : Prevent Pests In Cotton : పత్తిలో చీడపీడలు నివారించేందుకు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

ప్ర‌స్తుతం ఖ‌రీఫ్ సీజ‌న్ లో వేసిన కంది  పూత‌, కాత ద‌శ‌లో ఉంది. అయితే ఈ ద‌శ చాలా కీల‌క‌మైంది . ఈ స‌మ‌యంలో కందికి ప్రధాన శ‌త్రువులైన శ‌న‌గ‌ప‌చ్చ పురుగు, మారుక మ‌చ్చ‌ల పురుగుల తాకిడి అధికంగా కనిపిస్తోంది. వీటి నివార‌ణ‌కు వెంట‌నే త‌గిన చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని  పాలెం  కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్ర‌వేత్త‌ రాజ‌శేఖ‌ర్ రైతాంగానికి తెలియ‌జేస్తున్నారు.

ముకుంద‌ల మండ‌లం, స‌ర‌గోడు గ్రామానికి చెందిన రైతు  యాద‌య్య కందిపంట‌ను వేసి మంచి దిగుబ‌డుల‌ను తీస్తున్నాడు. అధిక దిగుబ‌డుల‌ను తీయాలంటే ఎలాంటి ప‌ద్ద‌తులు వాడాలో త‌న అనుభ‌వాల‌ను  చెబుత‌న్నారు.

READ ALSO : Chamanti Cultivation : చామంతి సాగులో చీడపీడలు, తెగుళ్ళ నివారణ !

కందికి పూత దశ అత్యంత కీలకం. చీడపీడలు, నీటి ఎద్దడి పరిస్థితులు దిగుబడిని ప్రభావితం చేస్తాయి కనుక ఈ దశలో రైతులు అప్రమత్తంగా వ్యవహరించాలి. పరిస్థితులకు అనుగుణంగా శాస్త్రీయ పద్ధతుల్లో యాజమాన్యం చేపడితే ఎక‌రాకు 5 -8 క్వింటాళ్ల దిగుబ‌డిని తీయ‌వ‌చ్చు.