Operation Valentine : లాస్ట్ మూవీ డిజాస్టర్.. అయినా రికార్డు స్థాయిలో వరుణ్ తేజ్ కొత్త మూవీ బిజినెస్..

వరుణ్ తేజ్ లాస్ట్ మూవీ గాండీవధారి అర్జున డిజాస్టర్ గా నిలిచింది. అయినాసరి 'ఆపరేషన్ వాలెంటైన్' బిజినెస్ రికార్డు స్థాయిలో..

Operation Valentine : లాస్ట్ మూవీ డిజాస్టర్.. అయినా రికార్డు స్థాయిలో వరుణ్ తేజ్ కొత్త మూవీ బిజినెస్..

Varun Tej Operation Valentine pre release business details

Operation Valentine : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) రీసెంట్ గా ‘గాండీవధారి అర్జున’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చి భారీ ప్లాప్ ని అందుకున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ.. ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ఇక ఈ మూవీ తరువాత వరుణ్ చేస్తున్న మూవీ ‘ఆపరేషన్ వాలెంటైన్’. వరుణ్ 13వ సినిమాగా వస్తున్న ఈ మూవీని కొత్త దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ మూవీకి సంబందించిన ఒక న్యూస్ ఫిలిం వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

Allu Arjun : లండన్‌లో అల్లు అర్జున్.. భార్య స్నేహ రెడ్డితో..

ఆ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ నాన్ థియేట్రికల్ బిజినెస్ మొత్తం 50 కోట్లకు వరకు జరిగిందంట. వరుణ్ కెరీర్ లోనే ఇది హైయెస్ట్ బిజినెస్. వరుణ్ తేజ్ లాస్ట్ మూవీ గాండీవధారి అర్జున డిజాస్టర్ గా నిలిచింది. అయినాసరి ఈ మూవీకి ఈరెంజ్ బిజినెస్ జరగడం సంచలనంగా మారింది. ఇక ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ ని కూడా కలుపుకొని మొత్తం ప్రీ రిలీజ్ బిజినెస్ దగ్గర దగ్గర 100 కోట్లు వరకు వెళ్లేలా ఉంది. మరి ఈ మూవీ ఏ రేంజ్ బిజినెస్ చేస్తుందో చూడాలి.

Shiva Rajkumar : తెలుగు హీరోలపై ప్రశంసలు కురిపించిన శివన్న.. ఎవరెవరి గురించి అంటే?

కాగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. వరుణ్ ఈ మూవీలో జెట్ ఫైటర్ గా కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో ఫిమేల్ లీడ్ గా మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ భామ మానుషి చిల్లర్ నటిస్తుంది. రెనైసెన్స్ పిక్చర్స్, సోని పిక్చర్స్ ఈ మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని డిసెంబర్ 8న రిలీజ్ చేయబోతున్నట్టు కూడా ప్రకటించారు. తెలుగు, హిందీ లాంగ్వేజ్స్ లో ఈ మూవీ రిలీజ్ చేయనున్నారట.