Prithviraj Sukumaran : మూడు నెలల తర్వాత యాక్సిడెంట్ నుంచి కోలుకున్న స్టార్ హీరో.. రోజుకి 9 గంటలు ఫిజియోథెరపీ..

మూడు నెలలుగా పృథ్వీరాజ్ ఆరోగ్యం గురించి ఎలాంటి అప్డేట్ లేదు. అప్పుడే బెడ్ రెస్ట్ అవసరం అవుతుందని డాక్టర్లు తెలిపారు. తాజాగా యాక్సిడెంట్ జరిగిన మూడు నెలల తర్వాత పృథ్వీరాజ్ మొదటిసారి తన ఆరోగ్యంపై స్పందించారు.

Prithviraj Sukumaran : మూడు నెలల తర్వాత యాక్సిడెంట్ నుంచి కోలుకున్న స్టార్ హీరో.. రోజుకి 9 గంటలు ఫిజియోథెరపీ..

Prithviraj Sukumaran Reacts first time after his Knee Operation Says Thanks to Doctors

Prithviraj Sukumaran : మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ పక్క మలయాళంలో వరుస సినిమాలు చేస్తూనే వేరే భాషల్లో కూడా సినిమాలు చేస్తున్నారు. హీరోగానే కాకుండా విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేస్తున్నాడు పృథ్వీరాజ్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్(Prabhas) హీరోగా చేస్తున్న సలార్(Salaar) సినిమాలో కూడా పృథ్వీరాజ్ విలన్ గా నటిస్తున్నాడు.

ఇటీవల జూన్ లో పృథ్వీరాజ్ ఓ సినిమా షూటింగ్ లో ప్రమాదానికి గురయ్యారు. పృథ్వీరాజ్ హీరోగా మళయాలంలో తెరకెక్కుతున్న విలాయత్ బుద్ధ అనే సినిమా షూటింగ్ లో కేరళ ఆర్టీసీ బస్సులో భారీ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తుంటే పృథ్వీరాజ్ బస్సులో నుంచి జారీ కింద పడ్డారు. ఈ ఘటనలో పృథ్వీరాజ్ కాలికి తీవ్ర గాయమైంది. దీంతో పృథ్వీరాజ్ కాలికి సర్జరీలు చేశారు.

మూడు నెలలుగా పృథ్వీరాజ్ ఆరోగ్యం గురించి ఎలాంటి అప్డేట్ లేదు. అప్పుడే బెడ్ రెస్ట్ అవసరం అవుతుందని డాక్టర్లు తెలిపారు. తాజాగా యాక్సిడెంట్ జరిగిన మూడు నెలల తర్వాత పృథ్వీరాజ్ మొదటిసారి తన ఆరోగ్యంపై స్పందించారు. తనకి ఇన్నాళ్లు చికిత్స చేసిన డాక్టర్స్ ఫోటోలని షేర్ చేసి వారికి థ్యాంక్స్ చెప్తూ స్పెషల్ పోస్ట్ చేశారు.

పృథ్వీరాజ్ సుకుమారన్ తన పోస్ట్ లో.. యాక్షన్ సన్నివేశాలు షూట్ చేస్తుండగా అనుకోకుండా నేను గాయపడి మూడు నెలలు అవుతుంది. నా మోకాలికి ఒక పెద్ద ఆపరేషన్(Knee Surgery) జరిగింది. ఇప్పుడు నేను రికవర్ అవుతున్నాను అంటే అందుకు ముఖ్యంగా ముగ్గురు డాక్టర్స్ కి ధన్యవాదాలు తెలపాలి. నాకు చికిత్స చేసిన డాక్టర్స్ కి, వాళ్ళ టీంకి, నాకు ఫిజియోథెరపీ చేసిన డాక్టర్ కి, అలాగే నేను త్వరగా కోలుకునేలా చేసిన మరో డాక్టర్ కి అంటూ వారి పేర్లతో సహా పెట్టి ధన్యవాదాలు తెలిపారు. అలాగే.. నేను పూర్తిగా కోలుకోడానికి మూడు నెలలు పడుతుందని చెప్పారు. ఇంకా ఎన్ని రోజులు ఇలాగా అనుకుంటూ గడిపాను. రోజుకు 9 గంటలపాటు ఫిజియోథెరపీలోనే ఉన్నాను. నా కోసం ఎంతో కష్టపడి, నన్ను కోలుకునేలా చేసిన డాక్టర్స్ అందరికి ప్రత్యేక ధన్యవాదాలు. వారే నను మళ్ళీ మాములు మనిషిని చేశారు. అలాగే నేను కోలుకోవాలని ప్రార్ధించిన నా అభిమానులకు, నా సన్నిహితులందరికి ధన్యవాదాలు. మళ్ళీ మీ అందర్నీ మెప్పించడానికి త్వరలోనే మీ ముందుకు సినిమా అప్డేట్స్ తో వస్తాను అని పోస్ట్ చేశారు.

Also Read : Samantha : సైకిల్ మీద ఆస్ట్రియాలో చక్కర్లు కొడుతున్న సమంత..

పృథ్వీరాజ్ సుకుమారన్ కోలుకుంటున్నాను అని మూడు నెలల తర్వాత స్వయంగా పోస్ట్ చేయడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరగా మీ సినిమాల కోసం ఎదురు చేస్తున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు.