Encounter : జమ్మూకశ్మీరులో మళ్లీ భారీ ఎన్‌కౌంటర్..ఇద్దరు సైనికులకు గాయాలు

Encounter : జమ్మూకశ్మీరులో మళ్లీ భారీ ఎన్‌కౌంటర్..ఇద్దరు సైనికులకు గాయాలు

Encounter

Encounter : జమ్మూకశ్మీరులో మంగళవారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. రాజౌరిలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు సైనికులు గాయపడ్డారు. రాజౌరీ అడవుల్లో దాక్కున్న ఉగ్రవాదుల కోసం సైనికులు గాలింపు చేపట్టారు. గాలిస్తుండగా సైనికులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. జిల్లాలోని అటవీ ప్రాంతంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ తర్వాత సాయంత్రం భద్రతా బలగాలు,ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఎదురు కాల్పుల్లో ఇద్దరు సైనికులు గాయపడ్డారని అధికారులు మంగళవారం తెలిపారు.

Also read : Malaria Vaccine : మలేరియా పీడిత ప్రాంతాల ప్రజలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుడ్ న్యూస్

అనుమానాస్పద కదలికలపై సమాచారం అందుకున్న సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసుల సంయుక్త బృందం సోమవారం కలకోట్ ప్రాంతంలోని బ్రో, సూమ్ అటవీ ప్రాంతాలను చుట్టుముట్టింది. ఉగ్రవాదులు సైనికులపై కాల్పులు జరిపారని, ఫలితంగా సైనికులు ప్రతీకార కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఆర్మీ సిబ్బంది గాయపడ్డారని, వారిని ఆస్పత్రికి తరలించామని పోలీసులు చెప్పారు. క్షతగాత్రుల పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు పేర్కొన్నారు.

Also read : Indian whisky : భారతీయ ఇంద్రి విస్కీ వెరీ టేస్ట్ గురూ…ప్రపంచ నంబర్ వన్ అవార్డ్

చుట్టుముట్టిన ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నట్లు భావిస్తున్నామని, వారు తప్పించుకునే మార్గాలను మూసి వేయడానికి అదనపు బలగాలను తరలించామని సైన్యం తెలిపింది. కలాకోట్‌లోని జనరల్ ఏరియాలో జాయింట్ ఆపరేషన్ ప్రారంభించామని, ఉగ్రవాదులను గుర్తించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నామని రక్షణ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. రాజౌరీ అడవుల్లో ఉగ్రవాదుల కోసం సైన్యం గాలింపు కొనసాగుతోంది.

Also read : Maharashtra : ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటల్లో 12 మంది నవజాత శిశువులతో సహా 24 మంది మృతి