Minister Roja Selvamani: మగాడి విజయం వెనుక స్త్రీ ఉంటుంది.. కానీ ఒక స్త్రీ విజయం వెనుక..

మనం చేస్తున్న పని తప్పా? కాదా? అని మనకు తెలిస్తే చాలు. మన మనసాక్షికి తెలిస్తే చాలు అంటూ రోజా అన్నారు.

Minister Roja Selvamani: మగాడి విజయం వెనుక స్త్రీ ఉంటుంది.. కానీ ఒక స్త్రీ విజయం వెనుక..

Minister Roja

Minister Roja Selvamani: మహిళల పక్షపాతి సీఎం జగన్ మోహన్ రెడ్డి. చరిత్రలో ఎవరు చేయని విధంగా మహిళలకోసం కృషి చేస్తున్నారు. లక్షలాదికోట్లు మహిళల అకౌంట్స్ లో నేరుగా డబ్బులు వేస్తున్న వ్యక్తి సీఎం జగన్ అని మంత్రి రోజా అన్నారు. గురువారం తిరుపతిలోని పద్మావతి మహిళా వర్సిటీ మహిళా సాధికారత సమావేశంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. సినిమా వాళ్ళు బ్లూ ఫిలింలు చేస్తారని ఒక పనికి మాలిన యదవ మాట్లాడాడంటూ ఇటీవల జరిగిన ఘటనను ప్రస్తావించారు.

Read Also : CEC : హైదరాబాద్ లో కేంద్ర ఎన్నికల అధికారుల బృందం పర్యటన.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై కసరత్తు

మనం చేస్తున్న పని తప్పా? కాదా? అని మనకు తెలిస్తే చాలు. మన మనసాక్షికి తెలిస్తే చాలు అంటూ రోజా అన్నారు. ఎవరో ఎదో తిట్టారని భయపడి వెనక్కి అడుగు వేయకుండా ముందుకెళ్ళాలని సూచించారు. మహిళల కోసం ఎంతో పోరాటం చేశాను. ఉద్యమాలు చేశాను. పాలు ఇచ్చే స్దాయి నుండి పాలించే స్ధాయికి దేశంలో మహిళలు ఎదిగారు. మహిళలకు 33శాతం రిజర్వేషన్లు ఇవ్వడం సంతోషంగా ఉందని రోజా అన్నారు. రిజర్వేషన్లు ఇవ్వకుండానే ప్రపంచంలో ఎన్నో విజయాలు సాధించిన ఘనత మహిళలదని అన్నారు.

Read Also : Telangana BJP: ఎన్నికల మూడ్‌లోకి తెలంగాణ బీజేపీ.. 14 ఎన్నికల కమిటీలు ప్రకటన.. పూర్తి వివరాలు ఇవే

మనం చేస్తున్న పని తప్పా, ఒప్పా అని మనకు తెలిస్తే చాలు. మహిళలు విమర్శలకు భయపడి పారిపోకూడదు. పోరాటం చేయాలి. మగాడి విజయం వెనుక స్త్రీ ఉంటుంది. కానీ, ఒక స్త్రీ విజయం వెనుక ఒక స్త్రీనే ఉంటుందని రోజా అన్నారు.